ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ఆదర్శ పాలన అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పేద ప్రజలందరికీ మెరుగైన విద్యను అందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మఒడి  పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. అమ్మఒడి పథకం ద్వారా పేద కుటుంబం లోనే ఓ విద్యార్థికి చేయూతనిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు . ప్రతి ఏటా కుటుంబంలోని ఒక విద్యార్థికి  15 వేల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించింది . 

 

 

 

 ప్రతి పేద విద్యార్థి స్కూలుకు వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు జగన్ సర్కార్ తెలిపింది . కాగా తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషను రూపుమాపేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 ఇదిలా ఉండగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పై  తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో  ఇంగ్లీష్ మీడియం పై ఎంపీ రఘురామ్  చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఇన్చార్జి వై.వి.సుబ్బారెడ్డితో  చర్చించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఎంపీ ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా క మాట్లాడడటం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తే  పేద విద్యార్థుల అభ్యున్నతిని  అడ్డుకోవడమే అని  జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మీడియం పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని జగన్  హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: