2019 మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  ఈ ఫలితాల్లో ఏపీలో వైకాపా పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.  అధికారాన్ని కైవసం చేసుకున్నాక అనేక పధకాలు రూపొందించింది.  ఎప్పుడు లేని విధంగా అధిరంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరసగా అమలు చేస్తూ దూసుకుపోయింది.  నిత్యం ఏదోఒక పధకాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడు.  


అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వంద రోజులు గడువు ఇవ్వాలని జనసేనాని జగన్ అనుకున్నాడు.  వందరోజుల వరకు జగన్ గురించిగాని, అతని పాలన గురించిగాని ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.  జగన్ వందరోజుల పాలనపై పవన్ గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయించుకున్నాడు.  ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో పధకాలు అమలు ప్రవేశపెడుతున్నా, అవి గ్రౌండ్ లెవల్లో అమలు కావడం లేదని రిపోర్ట్ వచ్చింది.  దానిపై మొదటిసారి పవన్ ట్వీట్ చేశారు.  


ఆ తరువాత రాష్ట్రంలో వరదలు రావడం.. ఇసుక లేకపోవడంతో ఇసుక సమస్యను తీసుకొని దానిపై పవన్ పోరాటం చేశారు.  ఇందులో భాగంగానే నవంబర్ 3 వ తేదీన వైజాగ్ లో లాంగ్ మార్చ్, సభ జరిగింది.  ఈ లాంగ్ మార్చ్ సూపర్ సక్సెస్ కావడంతో పాటుగా, సభ కూడా హైలైట్ అయ్యింది.  ఇక్కడ పవన్ తో పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొనడంతో అధికార పార్టీకి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.  


ఇసుక సమస్యపై స్పందించకుంటే.. అమరావతిలో నడుస్తానని చెప్పాడు.  ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నడిచి తీరుతానని చెప్పడంతో ఈ సమస్యపై జగన్ స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.  దీని తరువాత ఇంగ్లీష్ మీడియం గురించిన సమస్యను పవన్ తీసుకున్నారు.  వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇంగ్లీష్ లోనే బోధన జరగాలి.. అయితే, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా ఉంటుంది.  దీనిపై కూడా పవన్ స్పందించి ట్వీట్ చేస్తున్నారు.  ట్విట్టర్ ద్వారా ఉద్యమం చేస్తున్నాడు.  మొత్తంగా చూసుకుంటే, సెప్టెంబర్ వరకు సైలెంట్ గా ఉన్న పవన్, సెప్టెంబర్ తరువాత యాక్టివ్ అయ్యి పోరాటం చేయడం మొదలుపెట్టాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: