తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె గత 50 రోజుల నుంచి  డైలీ సీరియల్ లాగా జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఆ హైకోర్టు కాస్త ఈరోజుకి వాయిదా వేసింది. అయితే ఈ రోజు కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణపై హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 

                                  

ఆర్టీసీ, ప్రైవేట్ వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానిదేనని, కేబినెట్ నిర్ణయం తప్పు ఎలా అవుతుందని పిటిషనర్ ను ప్రశ్నించింది. కాగా 5100 రూట్లను ప్రైవేటీకరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్ చెప్పగా..ఎలా చట్ట విరుద్ధమో తెలపాలని కోర్టు అడిగింది. 

                                     

దీంతో పిటిషినర్ సెక్షన్ 99, 100, 102, 104 లను ప్రస్తావించగా.. పిటిషనర్ లో లేవనెత్తిన అంశాలకు ఇప్పుడు చెబుతున్న సెక్షన్లకు పొంతనలేని సమాధానాలు అని కోర్టు తెలిపింది.హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించగా సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని అన్నారు. 

          

కాగా ఆర్టీసీకి నష్టం జరగదని ముఖ్యమంత్రి చెప్పినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా ముఖ్యమంత్రి ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి అవసరం లేదని కోర్టు తెలిపింది. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా అన్నదే ముఖ్యమని హైకోర్టు తెలిపింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా అంటూ పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: