ఏపీ రాజకీయాల్లో ఒక్కటే ఉత్కంఠ. ఆ రోజు ఏం జరుగుతుంది అన్నది ఆ చర్చ. ఆ రోజుకు ఉన్న విశేషం ఏంటో రాజకీయ పండితులే చెప్పాలి. ఏపీకి సంబంధించి ఆ రోజుకు అంత ప్రాధాన్యత ఉందా అంటే ఉందనే అంటున్నారు. మామూలుగా అయితే 21వ తేదీ తరువాత 22వ తేదీ వస్తుంది. కానీ నవంబర్ 22వ తేదీ అలాంటిది కాదని అంటున్నారు. ఆ రోజున ఏపీలో వాడి వేడిగా ఉంటుందని చెబుతున్నారు.

 

అంతలా ఆ రోజు గురించిన చర్చ సాగడం వెనక చాలా కధే ఉంది. ఆ రోజు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన రోజు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ పెట్టుకున్నారు. అయితే సీబీఐ ట్రయల్ కోర్టు మాత్రం జగన్ పిటిషన్ని కొట్టేసింది. దీనికి కారణం సీబీఐ విభాగం తరఫున గట్టి వాదనలు వినిపించడం. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అందువల్ల ఆయనకు కనుక వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే మాత్రం సాక్ష్యులను బెదిరిస్తారని సీబీఐ వాదించింది. దానికి ట్రయల్ కోర్టు అంగీకరించి పిటిషన్ పక్కన పెట్టింది. 

 

దీంతో ఈ శుక్రవారం అంటే 22న జగన్ హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టు ముందు తప్పనిసరిగా హాజరుకావాలి. జగన్ కనుక హాజరు కాకపోతే ఆయన బెయిల్ రద్దు అవుతుంది. మరి జగన్ హాజరు అయితే నానా యాగీ చేయడానికి టీడీపీ వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కే ముఖ్యమంత్రి ఏపీని ఎలా పాలిస్తారని జనంలో రచ్చ చేయడానికి టీడీపీ స్క్రిప్ట్ రెడీ చేసిపెట్టుకుంది. నిందితుడు ముఖ్యమంత్రి కావడం ఏంటొ అంటూ జనంలోకి వెళ్ళి గోల చేయడానికి కూడా సిధ్ధపడుతోంది. 

 

మరి జగన్ కి హాజరైనా బాధే, హాజరు కాకపోయినా బాధే. దీంతో జగన్ ఏంచేస్తారు అసలు ఆ రోజు సీన్ అలా ఉంటుంది. పొలిటికల్ హీట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. దాంతో అందరి చూపు 22న ఏం జరుగుతుంది అన్న దాని మీద ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
              

మరింత సమాచారం తెలుసుకోండి: