తమిళ సినిమాల్లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు సూపర్ స్టార్స్ లో రజినీకాంత్ ఒకరైతే కమల్ హాసన్ మరొకరు. ఒకరు క్లాస్.. మరొకరు మాస్. ఇద్దరూ దిగ్దర్శకుడు బాలచందర్  శిష్యులే. నాలుగు దశాబ్దాల పాటు సినిమాల్లో తమ హవా కొనసాగించిన ఈ ఇద్దరూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయమ్ పేరుతో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు కూడా. త్వరలో రజినీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరిగింది.

 

 

ఇందుకు సంబంధించి ఈరోజు కమల్ హాసన్ ఓ ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చారు. 'రాజకీయాల్లో రజనీకాంత్‍తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధమే. మా ఇద్దరి మధ్య 40 ఏళ్ల స్నేహబంధం ఉంది' అంటూ కమల్‍హాసన్ మీడియాతో చెప్పారు. ఈ వార్త అలా వచ్చిందో లేదో దీనిపై సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. 'అవసరమైతే నేను కూడా కమల్‍హాసన్‍తో కలిసి పనిచేసేందుకు సిద్ధం' అని ప్రకటించారు. ఈ అంశంపై ఇరువురూ చెన్నై విమానాశ్రయమలోనే విడివిడిగా మాట్లాడారు. ఈ వార్త తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. స్నేహం వేరు, రాజకీయం వేరు అంటూ ఇదివరకే రజినీ స్పందించారు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలకు రజినీ సానుకూలంగా స్పందించటం ఆహ్లదకర రాజకీయ వాతావరణం నెలకొల్పింది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళని స్వామి రజినీకాంత్ పై మాటల యుద్ధం కూడా మొదలుపెట్టి విమర్శలు చేస్తున్నారు. 

 

 

దీంతో త్వరలోనే తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. కానీ.. రజినీ అన్నట్టు స్నేహం వేరు రాజకీయం వేరు. రజినీ, కమల్ పొలిటికల్ పార్టీలు పెట్టటంతో తమిళనాడులో చతుర్ముఖ పోటీ నెలకొనబోతోంది. ఈ పోటీ తీవ్రత తెలియాలంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: