వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అయితే ఈ గుడ్ న్యూస్ పెట్రోల్ డీజల్ తగ్గింది అని కాదు.. టోల్ ప్లాజాల గురించి ఈ న్యూస్. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో కొన్ని కొన్ని సార్లూ వాహనదారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే గంటల తరబడి అక్కడే టోల్ ప్లాజా వద్దే ఉండాలి. 

 

ఇది వాహనదారులకు అతి పెద్ద సమస్య. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహన దారులకు పెద్ద సమస్య ఏర్పడింది అనే చెప్పాలి. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. 

 

ఆ రూల్ ఏంటంటే జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో ఇప్పుడు ఫాస్టాగ్‌లను అంగీకరిస్తారు. అయితే ఈ నిబంధన డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇప్పటివరకు 400కు పైగా దేశవ్యాప్తంగా ఉన్నా టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్‌లను అంగీకరిస్తున్నారు. అతి త్వరలోనే ఇతర టోల్ ప్లాజాలలోనూ ఇదే విధానం అమలులోకి రానుంది.

 

ఈ విధానం వల్ల వాహదారులు టోల్ ప్లాజా వద్ద అపుడు క్యాష్ రూపంలో డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కేవలం ప్రతి వేహికిల్ అద్దం పై రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అయిన ఫాస్టాగ్‌ను అతికిస్తారు. ఈ ఐడెంటిఫికేషన్ తో టోల్ చార్జీలు వాటంతట అవే ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. 

 

ఇలా చెయ్యడం వల్ల వాహనదారులకు సమయం, పెట్రోల్ అన్ని సేవ్ అవుతాయని చెప్పచ్చు. అయితే ఫాస్టాగ్ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ సమాచారం వాహనదారుడు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి వస్తుంది. ఏది ఏమైనా ఈ వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ పెట్రోల్, డీజల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: