అధికార పార్టీ మీద విపక్షాలు విమర్శలు చేయడం సహజం. కానీ అదే పనిగా విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తే జనాల్లో పలచన పడి పోతాము. ఇప్పుడు ఆ విషయం జనసేన అధినేత పవన్ గారు తెలుసుకుంటే మంచిది. జగన్ అంటే చాలు ఒంటి కాలు మీదే లేచే పవన్ ఇప్పుడు ట్విట్టర్ లో చిలక పలుకులు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టే విషయమై అటు ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో.. దాన్ని వ్యతిరేకించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే పట్టుదలతో ఉన్నాడు.

అయితే పవన్ కళ్యాణ్  కు తెలుగు భాషా మీద మంచి ప్రేమ పుట్టుకొచ్చింది. తన పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో చెప్పకుండా ఏదేదో చెబుతున్నారు. సరైన కసరత్తు లేకుండా హఠాత్తుగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే తలెత్తే అనర్థాలపై ఏదేదో  రుజువులు చూపిస్తూ జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
 తాజాగా ట్విట్టర్లో జగన్‌ మీద పవన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. సరస్వతీ దేవి చిత్రాన్ని షేర్ చేసిన పవన్.. ‘జగన్ రెడ్డి గారు ‘భాష సరస్వతిని అమానించకండి’ అని పేర్కొన్నాడు. మరో ట్వీట్లో ‘జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ.. తెలుగు పేపర్ నడుపుతూ.. తెలుగును చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని సూచిస్తుందని పవన్ విమర్శించాడు. 

మొన్న మట్టికొట్టుకు పోతారని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ .. మాతృభాషను మృత భాషగా మార్చకండి అని పవన్ మరో ట్వీట్ వేశాడు. ఇంగ్లిష్ భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని.. తెలుగును మృత భాష కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలని.. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్ పేర్కొన్నాడు. 
 దీంతో పాటుగా ఇంగ్లిష్ మీడియం స్కూలింగ్ పేరుతో జరుగుతున్న అనర్థాల గురించి హిందూలో వచ్చిన ఒక ఆర్టికల్‌ను, మాతృభాషలో చదువు చెప్పాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఓ భాషా శాస్త్రవేత్తతో జరిపిన ఈనాడు ఇంటర్వ్యూను పవన్ ట్విట్టర్లో షేర్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: