బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ చెప్పలేరు.  ఒక్కో రోజు పెరుగుతుంది.  ఒక్కోరోజు తగ్గిపోతుంటుంది.  ఇలా తగ్గడం పెరగడం అన్నది షరా మామూలే.  రేటు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు ప్రపంచంలో బంగారం కన్నా ఎక్కువ ప్రియంగా మారిన వస్తువు ఒకటి ఉన్నది.  అదేంటో అందరికి తెలిసిందే.  దీని వలన ప్రభుత్వాలు సైతం కూలిపోయాయి గతంలో.  


ఇది కోయకుండానే ప్రతి ఒక్కరిని విపరీతంగా ఏడిపించడం మొదలుపెట్టింది.  దీనిని కంట్రోల్ చేయకుంటే దేశంలో మాములుగా అలజడి వస్తుంది.  ఆ అలజడి నుంచి తప్పుకోవడం అన్నది ఎవరితరం కాదు.  పరిస్థితులు అంతదారుణంగా ఉంటాయి.  అది మరేదో కాదు.. ఉల్లి.  ఉల్లి ధరలు ఉండే కొలది దారుణంగా పెరిగిపోతున్నాయి.  మనదేశం నుంచి ఉల్లి ఎప్పుడు వివిధ దేశాలకు ఏడుగుమతి అవుతుంది.  


ముఖ్యంగా పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లకు ఉల్లి ఎగుమతి అవుతుంది.  పాక్ తో ఉన్న గొడవల కారణంగా ఉల్లినే కాదు ఇతర వస్తువులను కూడా ఎగుమతి చేయడం లేదు.  కానీ, బాంగ్లాదేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.  బాంగ్లాదేశ్ కు అన్ని రకాల వస్తువులను ఇండియా సరఫరా చేస్తున్నది.  అయితే, కొంతకాలంగా ఇండియా నుంచి ఉల్లి ఎగుమతి కావడం లేదు.  ఇక్కడే సరిపడినంతగా ఉల్లి లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.  


దాదాపుగా లక్ష టన్నుల ఉల్లిని ఇండియా దిగుమతి చేసుకున్నది.  దిగుమతి చేసుకున్నా.. ధరలు దిగిరావడం లేదు.  ఇండియా నుంచి ఎక్కువ ఉల్లి బాంగ్లాదేశ్ కు ఎగుమతి అవుతుంది.  అయితే, ఇప్పుడు ఎగుమతి ఆగిపోవడంతో అక్కడ ఉల్లి ధరలు మంటలు పెడుతున్నాయి.  ఉల్లి ధర ఇప్పుడు అక్కడ ఏకంగా రూ. 260 కి చేరుకుంది.  కేజీ ఉల్లి ధర అంత అంటే మాములు విషయం కాదు.  మనదేశంలో 60 నుంచి 70 రూపాయలకు చేరుకుంటే పెద్ద గొడవలు జరిగిపోతాయి. కానీ, బాంగ్లాదేశ్ లో ఈ ధర రూ. 260 కి చేరడంతో అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: