ఇంటికి కాపలాగా ఎవరు ఉంటారు.. ఎవరుంటారు కుక్కలు కాపలాగా ఉంటాయి.  గేటు దగ్గర వాచ్ మెన్ ఉంటాడు.  లేదంటే వీధిలో గూర్ఖా ఉంటాడు అదీ కాదంటే పెట్రోలింగ్ పోలీసులు ఉంటారు.  ఇంటికి కుక్కలు కాపలాగా ఉంటె అంతకంటే సేఫ్ ఇంకేమి ఉంటుంది చెప్పండి.  రెండు కుక్కల్ని పెంచుకుంటే చాలు.. ఆ ఇంటికి కొత్త వ్యక్తులే కాదు దొంగలు కూడా రాడానికి భయపడతారు.  అయితే, ఓ వ్యక్తి అంతకు మించి అనేలా ఆలోచించాడు. 


అతని ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే.. ఇంటికి కొత్త వ్యక్తులు రాకూడదు అని చెప్పి ఏకంగా ఇంట్లో సింహాలను పెంచాం మొదలు పెట్టాడు.  వాటి వయసు రెండు నెలలు ఉన్నది.  అది ఒక చిన్న ఇల్లు అనుకుంటే పొరపాటే.. అదో పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్.  అందులో అనేక ఇల్లుతో పాటు స్కూల్ కూడా ఉన్నది.  రెగ్యులర్ గా పిల్లలు వస్తుంటారు.  పోతుంటారు.  పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులు ఆ సింహాల పిల్లలను చూసి భయపడుతున్నారు.  


వాటిని తీసేయండి అని అంటే.. లేదు లేదు ఇవి ఉండటం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని, పైగా దొంగల బెడద నుంచి కాపాడుకోవచ్చని అంటున్నాడు.  దొంగల సంగతిఏమోగానీ వాటిని చూసి భయపడాల్సిన పరిస్థితి వస్తున్నట్టు ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు.  ఇప్పుడు అవి పిల్లలే కావొచ్చు.  కానీ, పెద్దయ్యాక వాటిని వాటికి ఆకలేస్తే పిల్లల్ని, పిల్లల్తో పాటుగా తల్లిదండ్రులకు కూడా స్వాహా చేస్తే పరిస్థితి ఏంటి అన్నది అందరి ప్రశ్న.  ఈ ప్రశ్నకు ఎవరు బదులు చెప్తారు చెప్పండి.  


ఎన్నిసార్లు చెప్పినా ఆ యజమాని వాటిని అక్కడి నుంచి తరలించకపోవడంతో అందరూ కలిసి పోలీసులకు కంప్లైంట్ చేశారు.  ఈ కంప్లైంట్ అందుకున్న పోలీసులు అక్కడి వచ్చి ఆ రెండు సింహం పిల్లలను పట్టుకొని జంతు ప్రదర్శనశాలకు తరలించారు.  అయితే, వాటిని తరలించిన తరువాత ఆ యజమాని అక్కడ కనిపించడం లేదట.  ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.  వన్యమృగ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తారని భయపడి ఎక్కడికో పారిపోయాడు.  ఈ సంఘటన నైజీరియాలోని లాగోస్ నగరంలో జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: