ఆరు నెలల పాలనలోనే అనేక  గండాలు దాటుకుంటూ ముందుకు సాగుతున్న వైసీపీ సర్కార్ కి మరో కొత్త గండం పొంచి ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ చేస్తున్న పాలన పట్ల జనం ఏమనుకుంటున్నారో తెలియదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం కాకతో కలవరపడిపోతున్నాయి. బలమైన పార్టీ ఏపీలో వైసీపీ అవతరించడంతో కళ్ళు కుడుతున్నాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే గట్టిగా  వైసీపీ సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు.

 

దానికి ఆపరేషన్ క్రాస్ అన్న పేరు కూడా పెట్టారని ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు  ఈ ఆపరేషన్ని దగ్గరుండి మరీ  పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఏపీలో జగన్  అధికారంలోకి రావడానికి బీజేపీ కూడా సహకరీంచిదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ తానే సర్వ శక్తిమంతుడిగా భావిస్తూ దూకుడుగా సాగుతున్నారని కమలనాధులు విశ్లేషిసున్నారు.

 

జగన్ ఏపీలో పాలన ఎలా చేసుకున్నా ఫరవాలేదు కానీ ఏపీలో పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు జరుగుతున్నాయని బీజేపీ నేతలకు ఫిర్యాదులు వస్తున్నాయట. దాని మీద ద్రుష్టి పెట్టడం కోసమే బీజేపీ పెద్ద నేతలు రంగంలోకి దిగారని అంటున్నారు. మత మార్పిళ్ళకు బీజేపీ వ్యతిరేకమని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక బీజేపీ దర్యాప్తులో నిజం అయితే మాత్రం ఏపీలో పరిణామాలు చాలా పెద్ద ఎత్తున మారుతాయని అంటున్నారు.

 

అందుకే ఆపరేషన్ క్రాస్ అని దీనికి పీరు పెట్టి మరీ ఏపీని బీజేపీ టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఏపీలో జగన్ వచ్చిన తరువాత మత మార్పిళ్ళు జరుగుతున్నాయా లేక విపక్షాలవి ఉత్త ఆరోపణ మాత్రమేనా అన్నది కూడా చూస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీతో ఏపీ సర్కార్ కి చెడిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలోనే మంత్రి అవంతి శ్రీనివాసరావు అవన్నీ తప్పు, టీడీపీ తప్పుడు ప్రచారం,   వైసీపీ కుట్ర అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు.

 

ఇక ఇదిలా ఉండగా ఏపీలో కనుక మత మార్పిళ్ళు కధ నిజం అని తేలితే మాత్రం కొత్త ఏడాది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. జగన్ సర్కార్ని  అస్థిరపరచే చర్యలు చేపట్టకపోయినా గట్టి  ఝలక్ ఇచ్చే విధంగా బీజేపీ పెద్దల ఆపరేషన్ క్రాస్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: