దేశంలో హత్యలు, హత్యాచారాలు, రౌడీయిజం వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  చిన్న చిన్న విషయాలకు కూడా రెచ్చిపోయి హత్యలు చేస్తున్నారు.  చేసింది తప్పు అని తెలుసుకొని పాపం ఇబ్బందులు పడుతున్నారు.  ఒకసారి తప్పు చేసిన తరువాత తప్పు అని తెలిసినా ఏమి చేయగలుగుతారు.  ఇబ్బందులు పడాల్సిందే కదా.  ఇబ్బందుల నుంచి ఎవరూ బయటపడలేరు.  ఎలాగోలా తప్పించుకోవాలని చూసినా తప్పించుకోవడానికి వీలుపడదు.  


అభంశుభం తెలియని చిన్నపిల్లలు సైతం హత్యలు చేస్తున్నారు.  విచక్షణ రహితంగా హత్యలు చేస్తున్నారు.  హత్యలకు గురవుతున్నారు.  ఇటీవలే నిజామాబాద్ లోని హమాల్ వాడి ప్రాంతం.  అక్కడ ఇద్దరు పిల్లలు.  అందులో ఒకరు పదోతరగతి చదువుతుంటే.. మరొకరు ఎనిమిది చదువుతున్నారు.  ఇద్దరు దోస్తులే.  మంచిగా ఉంటారు.  ఆటలాడుతుంటారు. ఈ ఆటలే వారి కొంపముంచాయి.  హత్యాయత్నం చేసే వరకు తీసుకొచ్చాయి.  


ఈ ఇద్దరికీ లూడో గేమ్ అంటే పిచ్చి.  పిచ్చి అనే కంటే బానిసలయ్యారు అని చెప్పొచ్చు.  ఓ రోజు ఈ ఇద్దరు కూర్చొని లూడో గేమ్ ఆడుతున్నారు.  ఊరికే ఆడుకుంటే పర్వాలేదు.  కానీ, డబ్బులు పందెం వేసి గేమ్ ఆడుతున్నారు.  ఈ గేమ్ లో రూ. 80 రూపాయల దగ్గర తేడా వచ్చింది.  ఈ తేడా ఎక్కడికి దారితీసింది అంటే.. కత్తితో అవతలి వ్యక్తిని దారుణంగా పొడిచే వరకు దారితీసింది. పదోతరగతి చదివే విద్యార్థి, 8 వ తరగతి చదివే విద్యార్థిని ఆటలో వచ్చిన మాటల కారణంగా పొడిచేశాడు.  


ఇలా పొడవడంతో.. ఆ పిల్లడు గిలగిలా కొట్టుకున్నాడట.  అంటే హుటాహుటిన ఆ పిల్లాడిని అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు.  కడుపులో గాయాలు ఎక్కువ కావడంతో ప్రాణాయాప స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  ప్రస్తుతం పోలీసులు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఈ విచారణ తరువాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: