ఆనందంగా సాగుతున్న జీవితంలోకీ మరణం ఎప్పుడు వచ్చి తనపని ముగిస్తుందో చెప్పలేం. దాని రాక సమయం కూడ తెలుసుకోవడం చాల కష్టం. ఇకపోతే అది ఏ రూపంగా వచ్చి ప్రాణాలు తోడేస్తుందో  తెలియదు.

 

 

కన్న పిల్ల ద్వారా ఐనా రావచ్చూ, లేదా పెంపుడు జంతువుల ద్వారా ఐనా కావచ్చూ, లేదా వాహన రూపంలో కూడా మృత్యువు కబళించ వచ్చూ. ఇక కొన్ని కొన్ని మరణాలు అత్యంత బాధాకరంగా ఉంటాయి. మరణిస్తాము అని తెలిసిన ఏం చేయలేని దుస్దితి ఆ సమయంలో ఎవరైనా వచ్చి కాపాడుతే బాగుండుననే ఆశ కలుగుతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్దితినే ఎదుర్కొంది పాపం ఓ మహిళ.

 

 

గర్భవతిగా ఉన్న ఆవిడను ఆమె పెంచుకుంటున్న కుక్కలే ఇతర శునకాలతో కలసి దాడి చేసి దారుణంగా హతమార్చాయి. ఈ విషాద సంఘటన ఫ్రాన్స్‌లోని విల్లర్స్-కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. కుక్కలు జరిపిన దాడిలో పాపం ఆ గర్భిణి (29) మృతిచెందింది.

 

 

ఇకపోతే ప్యారిస్‌కు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలో. ఓ మహిళ తన పెంపుడు కుక్కలను తీసుకుని దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతానికి నడకకు వెళ్లింది. కాగా ఆమె ఊహించని విధంగా ఒక్కసారిగా ఇతర కుక్కలు వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డాయి.

 

 

ఆ సమయంలో ఆమె తన సహచరిని పిలిచింది. కాని అతను వచ్చేసరికి మహిళ కాళ్లు, చేతులు, తలపై కుక్కలు దారుణంగా దాడి చేసి కరవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిగా అక్కడ కుక్కల దాడిలో సదరు మహిళ మరణించినట్లు నిర్దారణ అయింది.

 

 

దీంతో 90 కుక్కలను విచారణ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. వీటిలో సదరు మహిళకు చెందిన ఐదు కుక్కలు సైతం ఉన్నాయని తెలిసింది.. ఇకపోతే జింకల వేట కోసం వచ్చిన కుక్కలు మహిళపై దాడి చేసి చంపినట్లుగా అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: