క్షేత్రస్ధాయిలో తెలుగుదేశంపార్టీ, బిజెపి నేతల వ్యవహార శైలి చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టాలనే టార్గెట్ తో పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. దీనికంతటి మూలం తిరుమల శ్రీవారి దర్శనం కోసం జగన్ వెళ్ళినపుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వటం లేదు ? అన్న చంద్రబాబునాయుడు ప్రశ్న. అంటే జగన్ ను గబ్బు పట్టించేందుకు చంద్రబాబు దిగజారిపోతున్నారనటానికి ఇదే నిదర్శనం.

 

మొదట ఈ ప్రశ్న చంద్రబాబు లేవనెత్తారు. మాట్లాడిన ప్రతి సమావేశంలోను ఇదే ప్రశ్నను చంద్రబాబు పదే పదే అడిగారు. అంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చాలా జాగ్రత్తగా పావులు కదపటం మొదలుపెట్టిన విషయం అర్ధమైపోతోంది. ఇంతకీ చంద్రబాబు ఆ ప్రశ్న ఎందుకు పదే పదే అడుగుతున్నారు ? ఎందుకంటే సోనియాగాంధి, అబ్దుల్ కలాం తిరుమల వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇచ్చారట.

 

అత్యున్నత స్ధాయిలో ఉన్న వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చినపుడు జగన్ ఎందుకు ఇవ్వడు ? వాళ్ళకన్నా అతీతుడా ? అంటూ యాగీ మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళకు జగన్ కు సంబంధం లేదు. ఎందుకంటే గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు తిరుమలకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. 

 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాదయాత్రకు ముందు, పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్ స్వామివారిని దర్శించుకున్నారు. అప్పుడెప్పుడు చంద్రబాబు ఈ ప్రశ్న ఎందుకడగలేదు ? పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా జగన్ చాలాసార్లే తిరుమల వెళ్ళారు కదా ? మరి అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులకు  చెప్పి డిక్లరేషన్ తీసుకోవాలని ఎందుకడగలేదు ?

 

ఎందుకడగలేదంటే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేదడన్న ధీమాతో ఉండేవారు చంద్రబాబు. ఎప్పుడైతే ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నారో అప్పటి నుండే జగన్ అంటే చంద్రబాబులో ధ్వేషం మొదలైంది. దాన్ని తీర్చుకునే దారిలేక చివరకు రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ వేరు హిందువులు వేరనే మత విధ్వేషాన్ని రెచ్చగొట్లే ప్లాన్ వేశారు. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: