ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు నెరవేరాలని చెప్పి గత 47 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్నది ప్రధానమైన డిమాండ్.  ఈ డిమాండ్ ప్రస్తుతం పక్కన పడింది. విలీనం చేయాలి అనే విషయాన్నీ పక్కన పెట్టి, తమ ప్రాధమిక డిమాండ్లు నెరవేర్చాలని, ప్రాధమిక డిమాండ్లు నెరవేరిస్తే సమ్మె విరమిస్తామని, కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  


కానీ, ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు.  హైకోర్టు ఎంత చెప్పినా ప్రభుత్వం వినడం లేదు.  తమ పరిమితులకు లోబడి మాత్రమే తాము విచారణ చేస్తున్నట్టు హై కోర్టు పేర్కొన్నది.  హైకోర్టు చెప్పిన దానిప్రకారం సమ్మె చట్ట విరుద్ధంగా లేదని చెప్పిన సంగతి తెలిసిందే.  రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని తీర్పు చెప్పింది.  


ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు లేబర్ కోర్టులో ఉన్నది.  ఈ కోర్టు తీర్పును బట్టి ప్రభుత్వం నిర్ణయం ఉండొచ్చు.  లేబర్ కోర్టులో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.  కార్మికులు కూడా తమకే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.  లేబర్ కోర్టులో కేసు ఉన్నందున తీర్పు వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ అంటోంది.  


ఇప్పటికిప్పుడు సమ్మెను విరమిస్తే.. ప్రభుత్వం భవిష్యత్తులో సమ్మె చేయకుండా గట్టి చర్యలు తీసుకుంటుందని అందుకే లేబర్ కోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు కాపీ వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మిక జేఏసీ భావిస్తోంది.  అయితే, ఉద్యోగ భద్రత విషయంలో కార్మికులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని జేఏసీ భావిస్తోంది.  సమ్మెను కొనసాగిస్తే ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోతామేమో అని భయపడుతున్నారని, ఉద్యోగాలు ఎక్కడికి పోవని ఆర్టీసీ జేఏసీ చెప్తున్నది. ఒకవేళ లేబర్ కోర్టులో కార్మికులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతానికి ప్రస్నార్ధకమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: