ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నది చాలా కాలంగా పోరాడుతున్న అంశమే. విభజన హమీలో ప్రత్యేక హోదా కూడా ఉంది. అసలు ఏపీని అడ్డగోలుగా విడగొట్టినందుకే ప్రత్యేక హోదా ఇస్తామని నాడు చెప్పారు. నిజానికి ఇది ఏపీ ప్రజలు ఇవ్వండి బాబూ ప్రత్యేక హోదా అంటూ ప్రతీ రోజు 
అడిగేది కాదు, ఇది రాజధాని లేక, అభివ్రుధ్ధి అంటూ కానరాక ఇబ్బంది పడుతున్న పదమూడు జిల్లాల  ఏపీని ఊరడించడానికి ఇచ్చిన వరం. మరి దాని మీద ఆరేళ్ళు దగ్గర పడుతున్నా ఎటూ తేల్చని సర్కార్ కేంద్రంలో ఉంది.

 

నరేంద్రమోడీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అదే సమయంలో మంత్రులు అధికారులు మాత్రం హోదా లేదని  అనేకసార్లు క‌చ్చితంగా చెప్పేశారు. తాజాగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన ఎంపీలకు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా పార్లమెంట్ లో పోరాడమని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో  ఏపీ ఎంపీల పోరాటం ఇంకా పార్లమెంట్ మొదలు కాలేదు కానీ కేంద్రం  మరో వైపు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.

 

పొరుగున ఉన్న ఒడిషా రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా కోరుకుంటోంది. దాంతో  ఒడిషాకు ప్రత్యేక హోదా అర్హత లేదని కేంద్రం క్లారిటీగా చెప్పేసింది.  జాతీయ అభివ్రుధ్ధి మండలి పలు అంశాలను పరిగణలోకి  తీసుకుని సమగ్ర పరిశీలన అనంతరం హోదా అర్హత  లేదని  తేల్చేసింది. ఈ విషయాని ఒడిషా సర్కార్ కి సమాచారం కూడా ఇచ్చినట్లుగా కేంద్రం తెలిపింది. 

 

ఇదిలా ఉండగా ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికి పలుమార్లు ఒడిషా కోరిన సంగతి తెలిసిందే.   దీంతో ఒక్క ఒడిషాకే కాదు, ప్రస్తుతం ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు అసలు లేనే లేవని పక్కాగా కేంద్రం చెప్పేసింది. అంటే ఒడిషాకు ఇచ్చిన సమాధానంతోనే ఏపీకి కూడా గట్టి షాక్ ఇచ్చేసిందన్నమాట. మరి మన ఎంపీలు దీని మీద పార్లమెంట్ లో ఎలా పోరాడుతారో చుడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: