హైదరాబాద్ నగరంలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని సురేశ్ బాబు నివాసం, రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుండి అధికారులు సురేశ్ బాబు ప్రొడక్షన్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఐటీ అధికారులు సురేశ్ బాబు ఇంటిపై, కార్యాలయంపై, రామానాయుడు స్టూడియోలో ఎందుకు సోదాలు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. 
 
సురేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర నిరాతల్లో ఒకరు. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న వెంకీమామ సినిమాకు సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో సురేశ్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో బాగా పాపులర్ అయింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కీలక పత్రాల గురించి అధికారులు సురేశ్ బాబు మరియు కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. 
 
ఈరోజు తెల్లవారుజామునుండి మొదలైన సోదాలలో ఆర్థిక లావాదేవీల గురించి ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాల ఐటీ రిటర్న్స్ చెల్లించారా లేదా అనే వివరాలు కూడా ఐటీ అధికారులు  సేకరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సురేశ్ బాబుకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. 
 
ఎంతో ప్రాముఖ్యత పొందిన రామానాయుడు స్టూడియోలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన ఆరోపణలు రావడంతోనే ఈ ఐటీ అధికారుల దాడులు జరిగాయని సమాచారం. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ దాడులు సురేశ్ బాబు ఇంట్లో, కార్యాలయాల్లో, రామానాయుడు స్టూడియోలో చేస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబుపై ఐటీ దాడులు జరగటంతో మరికొంతమంది నిర్మాతలపై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: