అనగనగా ఓ కుర్రోడు.. వయసు పట్టుమని 14 ఏళ్ళు కూడా సరీగా లేవు.. ఆ వయసులో ఉండే పిల్లలు సరదగా ఫ్రెండ్స్ తో కలిసి బతకాని, లేదంటే స్కూల్, చదువు ఇలా వాటిల్లోనే మునిగిపోయి ఉంటారు.  కానీ, ఈ కుర్రోడు మాత్రం అలా కాదు.  వాడి ఆలోచనలు వేరుగా ఉన్నాయ్. భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ఎంతటి దారుణంగా ఆలోచించాడు అంటే వాడి గురించి తెలిస్తే నిజంగా బాబోయ్ ఇలా ఎలా చేస్తారు అనిపిస్తుంది.  అసలు విషయంలోకి వెళ్తే... 


హైదరాబాద్ లోని మీర్ పేటకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు.. ఏడేళ్ల వయసులో ఉన్న ఓ పిల్లోడిని కిడ్నాప్ చేశాడు.  కిడ్నాప్ చేసి ఆ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మూడు లక్ష్లలు ఇవ్వాలని ఫోన్ చేసి డిమాండ్ చేశారు.  అయితే, వాయిస్ ను బట్టి చిన్నపిల్లవాడు ఫోన్ చేశాడని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.  ఫోన్ కాల్, పేస్ బుక్ ఆధారంగా కిడ్నాప్ చేసిన బాలుడిని గుర్తించారు.  14 ఏళ్ల కుర్రోడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.  


ఆ కుర్రోడు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు.  సినిమాల్లో హీరోలు డబ్బుల కోసం ఎలా కిడ్నాప్ చేస్తారో చూసి నేర్చుకున్నానని, అలానే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పాడు.  ఒకవేళ కిడ్నాప్ చేసిన డబ్బులు చేతికి వస్తే ఏం చేస్తావని అడిగితె.. దానికి ఆ కుర్రోడు ఏం చెప్పాడో తెలుసా.. డబ్బులు చేతికి వస్తే.. ఆ డబ్బులతో ముంబై వెళ్లి జల్సాలు చేస్తానని చెప్పాడు.  ఇది పోలీసులు షాక్ అయ్యారు.  సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  


గతంలో ఈ బాలుడు ఓ ఇంట్లో లక్ష రూపాయలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు.  అయితే, దొంగతనం సెటిల్ మెంట్ ను చేయడంతో ఈ కేసు బయటకు రాలేదు. అప్పుడే పోలీసులకు చెప్పి ఉంటె ఈ ఉదంతం జరిగి ఉండేది కాదు.  ఆ కేసు సెటిల్మెంట్ చేసుకున్న నెలరోజుల్లోనే ఈ సంఘటన జరగడం విశేషం. సినిమాలు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: