ఏపీలో ఇప్పుడు కొత్త కలకలం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ నవశకం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వాలంటీర్లు గ్రామ, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పలు రకాల కార్డుల జారీకి సర్వే నిర్వహిస్తారు. సర్వే ఆధారంగానే బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక, విద్యాదీవెనకు ప్రత్యేక కార్డులు ఇస్తారు.

 

కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వే ఆధారంగా చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఏరివేసే అవకాశం ఉంది. ఇది తమను గుర్తించి పథకాలకు దూరం చేసేందుకేనని టీడీపీ వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం ఈ తెల్ల రేషన్ కార్డు మీదే ఆధారపడి ఉన్నాయి.

 

రాష్ట్రప్రభుత్వం వార్షికాదాయాన్ని రూ. లక్షా 80 కు పెంచి.. వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్డు, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. రూ. లక్షా 80వేలు పైబడిన వారికి రేషన్ నిలిపివేయడం వలన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి.

 

అయితే ఈ కొత్త సర్వేతో తమకు ఎక్కడ ముప్పు వాటిళ్లుతుందోనని టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నా... ఇందులో వివక్ష ఉంటుందేమోనని వారు అనుమానపడుతున్నారు. నెలరోజులపాటు జరగనున్న ఈ సర్వేలో రోజుకు ఐదు ఇళ్ల చొప్పున వివరాలు నమోదు చేసుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: