తెలుగు దిన పత్రికల్లో టీడీపీ కరపత్రికలు అని బాహాటంగానే తెలిసిన పత్రికలు రెండు ఉన్నాయి. అవి బాబు భజన కోసం పోటీ పడుతుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయకుడిగా ఎదిగేందుకు ఇతోధిక సాయం చేసింది ఒక పత్రికైతే.. ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుంచీ అనుకూలమైన కలంగా పనిచేస్తున్నది మరో పత్రిక. బాబును అన్ని విషయాల్లోనూ ఆకాశంలోకెత్తడమే ఈ రెండు పత్రికల ప్రధాన అజెండా.

 

దాదాపుగా టీడీపీకీ, చంద్రబాబుకు భజన పత్రికలుగా ఈ రెండూ పేరుపడ్డాయి. బాబు తుమ్మినా దగ్గినా బ్యానర్ ఐటమ్‌ లు రాసి మరీ ప్రాధాన్యత ఇచ్చే ఈ రెండు పత్రికలు అత్యంత ముఖ్యమైన ఒక విషయంలో మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. అమరావతి పేరు రాసేటప్పుడు అమెరికా రాజధాని అంత బిల్డప్ తో గ్రాఫిక్ ఫొటోలూ, అంతులేని తేజస్సుతో బాబు ఫొటోలూ ముద్రించే ఈ పత్రికల్లో చంద్రబాబుకు చెందిన అత్యంత ప్రధాన వార్తకు సింగిల్ కాలమ్ స్పేస్ కూడా దక్కకపోవడం విచిత్రంగా చెప్పుకుంటున్నారు.

 

14 ఏళ్ల నాడు చంద్రబాబు మీద లక్ష్మీపార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు నేటికి మోక్షం కలిగింది. 14 ఏళ్ల క్రితం బాబు హైకోర్టుకెళ్లి తెచ్చుకున్న స్టే ఇప్పుడు తొలిగింది. ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం సుప్రీం నిర్దేశాలకనుగుణంగా స్టే ని తొలగించి బాబుపై విచారణ చేపడుతున్నట్టు ప్రకటించింది. మరి ఇంత పురాతనమైన, ప్రాధాన్యమైన వార్తను మాత్రం ఒక భజన పత్రిక కనీసం చంద్రబాబు నాయుడు ఫొటో కూడా వేయకుండానే ప్రచురించింది.

 

ఇక మరో పత్రిక ఈ విషయాన్ని ప్రచురించాల్సిన అవసరం కూడా లేదనుకుంది. ఈ రెండు పత్రికలు బాబు మీద వచ్చే అవినీతి ఆరోపణలు, టీడీపీ అధినాయకుడికి ప్రతికూలంగా ఉండే వార్తలూ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: