ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించారు. కానీ రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ ను మాత్రం చంద్రబాబు నాయుడు విడుదల చేయలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రోజునుండి వైసీపీ నేతలు రాజధానిని మరో చోటుకు తరలించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి తేల్చటం కొరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేశారు. జీఎన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాల్ని రాజధాని అంశం గురించి సేకరించింది. నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసిందని అతి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను ఇవ్వబోతుందని సమాచారం. 
 
తెలుస్తున్న సమాచారం మేరకు అసెంబ్లీ ప్రాంగణాన్ని, సచివాలయాన్ని మంగళగిరికి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. నిపుణుల కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చేస్తే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మాత్రం హైకోర్టును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా పర్యటిస్తున్న నిపుణుల కమిటీ రాజధాని ప్రాంత అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి సమగ్ర నివేదిక అందించటానికి సిద్ధమైందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఏపీ ప్రభుత్వం నుండి రాజధాని గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితం ఇండియా పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవటంతో రాజధాని గురించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కొంత కలవరం మొదలైంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా...? లేక రాజధానిని మారుస్తారా..? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఎదురు చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: