రైతుకు గిట్టుబాటు ధర రావాలి. అప్పుడే రైతు సంతోషంగా వ్యవసాయం చేస్తాడు. నలుగురికి తిండిపెడతాడు. కానీ వాస్తవంలో అలా జరగడం లేదు. అందుకే రైతులు రోడ్లపై టమాటాలు పారబోస్తున్నారు. ఉల్లిపాయలు మార్కెట్ లోనే వదిలేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా జగన్ సర్కారు రైతు ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చింది.

 

ఈ ధరల స్థిరీకరణ నిధి నుంచి ఐదు మాసాల్లో రూ. 475 కోట్లు వినియోగించారు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 4000 కోట్లు కేటాయిస్తానని చెప్పారు.. కనీసం రూ. 4 కోట్లు ఖర్చు చేయని దౌర్భాగ్య పరిస్థితి ఉందని వైసీపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అంటున్నారు. కానీ తమ సర్కారులో రైతు ఇబ్బంది పడబోడని అంటున్నారు.

 

రైతుకు ఏ కష్టం రాకూడదని ప్రతి నెలా వ్యవసాయ మిషన్‌ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, రైతులకు మేలు చేసే ప్రతీ నిర్ణయం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్నారని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మార్కెట్‌లోకి వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేక రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మొక్కజొన్నకు సంబంధించి రూ. 600 కోట్ల నష్టం అని మాట్లాడుతున్నాడని, ప్రతి అంశంపై పొంతన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడన్నారు.

 

రైతులు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారు. ఈ క్రమంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి శనగ రైతులను ఆదుకోవాలని రూ.330 కోట్లు కేటాయించడం, దానిలో ఇప్పటికే 225 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్‌ చేయడం, రూ. 75కోట్లు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. సుబాబుల్‌ రైతులకు సంబంధించి ఒక ప్రైవేట్‌ కంపెనీ కొనుగోలు చేసి రైతులను నష్టపరిస్తే.. ఆ నష్టాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి రూ. 5 కోట్లు అందించారు. వాటితో పాటుగా పల్సస్‌ కొనుగోలు సంబంధించి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ. 110 కోట్లు కేటాయించి వివిధ ప్రాంతాల్లో కొనుగోలు ప్రాంతాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయించాంమని చెబుతున్నారు మంత్రి మోపిదేవి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: