ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, ఎమ్మెల్యే కందాల ఉ పేంద‌ర్‌రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు. గ‌త ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు...  కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉపేంద‌ర్ రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత ఉపేంద‌ర్‌రెడ్డి అధికార పార్టీలో చే రిపోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది.  ఈక్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ శ్రేణులు సై తం రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. ఈ నేప‌థ్యంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన సంస్థాగ‌త ఎన్నిక‌లు అధికార పార్టీలో మ‌రింత చి చ్చుపెట్టాయి.

 

ఇటీవ‌ల నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో లుక‌లుక‌లు బ‌య‌ట ప‌డ్డాయి. ఈస‌మావేశంలో ప‌లువురు నాయ‌కులు బ‌హిరంగం గానే ఎమ్మెల్యే పై త‌మ అసంతృప్తిని  వెల్ల‌గ‌క్కా రు. సీనియ‌ర్ నేత తుమ్మల నాగేశ్వ‌ర్‌రావును సంప్ర‌దించ‌కుండా, ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్‌రెడ్డి ఏక ప‌క్షంగా వ్య‌వ‌హిరిస్తున్నాడ‌ని, క‌నీసం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు పుస్త‌కాలు సైతం తుమ్మ‌ల వ‌ర్గానికి ఇ వ్వ‌క‌పోవ‌డం స‌రైందికాద‌ని మండిప‌డ్డారు. అంతేగాక పార్టీ మండ‌ల క‌మిటీలను కూడా ఎమ్మెల్యే ఏక‌ప‌క్షంగా నియ‌మించం ఏంట‌ని వారు ప్రశ్నించారు.

 

మాజీ మంత్రి తుమ్మ‌ల వ‌ర్గాన్ని చిన్న‌చూపు చూస్తే స‌హించేదిలేద‌ని, వెనుక‌బ‌డిన పాలేరు నియోజ‌క‌వర్గ అభివృద్ధికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన తుమ్మ‌ల‌ను కాద‌ని, గ్రూపు రాజ‌కీయాలు న‌డ‌ప‌డం స‌రికాద‌ని ఆయ‌న వ‌ర్గం నేత‌లు ఎమ్మెల్యే కందాల‌ను హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు తుమ్మ‌ల వ‌ర్గం నేత‌లు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించిన తుమ్మ‌ల నేడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓ సామాన్య ఎమ్మెల్యేను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు.

 

ఉపేంద‌ర్‌రెడ్డికి పార్టీలోనే కొంద‌రు ప్ర‌యార్టీ ఇస్తున్నారు. దీంతో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. కందాల వైఖ‌రిలో వైఖ‌రిలో మార్పు రాక‌పోతే సంక్రాంతి త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని కూడా తుమ్మ‌ల వ‌ర్గం నేత‌లు పేర్కొంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: