గత కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా మారిపోతున్నాయి.  ఎవరు ఎలా ఎప్పుడు రియాక్ట్ అవుతారు. ఏ పార్టీపై ఎవరు స్పందిస్తారో తెలియడం లేదు.  రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులు జంప్ కావడం సహజమే.  కానీ, వైకాపా ఈ విషయంలో అనుసరిస్తున్న విధానాలు వేరుగా ఉండటంతో ఆ పార్టీలోకి వెళ్ళాలి అనుకునే నేతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.  వైకాపాలో జాయిన్ కావాలి అంటే.. ముందు పార్టీకి రాజీనామా చేయాలి.  


పార్టీకి రాజీనామా చేయడంతో పాటుగా, ఎమ్మెల్యే పదవిలో ఉంటె ఆ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలోకి రావాలి.  ఒకవేళ పార్టీలోకి వచ్చి వైకాపాలో జాయిన్ అయితే, ఆ పార్టీ నుంచి టికెట్ వస్తుందా రాదా అన్నది వేరే విషయం.  ఒకవేళ టికెట్ వచ్చినా గెలుస్తారా లేదా అన్నది కూడా చూడాలి.  గెలుపు ఓటమి అన్నది ఎవరి చేతుల్లో ఉండదు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.  


పార్టీకి రాజీనామా చేశారు గాని, పదవికి రాజీనామా చేయలేదు.  పదవికి రాజీనామా చేయకుంటే.. వైకాపాలో జాయిన్ కాలేరు.  జగన్ నుంచి వంశికి ఎలాంటి హామీ ఇంకా రాలేదనుకుంటా అందుకే వంశి ఇంకా పదవికి రాజీనామా చేయలేదు.  దీనిపై యార్లగడ్డ స్పందించారు.  జగన్ దగ్గర వంశికి సంబంధించిన విషయాలు చర్చకు రాలేదని అన్నారు.  వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటానని యార్లగడ్డ పేర్కొన్నారు.  


భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఊహించి మాట్లాడటం కష్టం అని, అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని యార్లగడ్డ పేర్కొన్నారు.  పార్టీలోకి ఎవరు రావాలి అన్నా కూడా పార్టీకి,పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడే పార్టీలోకి అడుగుపెడతారని యార్లగడ్డ పేర్కొన్నారు.  ఈ పరిణామాలనుఁ బట్టి చూసుకుంటే, వంశి వైకాపాలో జాయిన్ అవుతారా లేదంటే స్వతంత్రుడిగా ఉంటారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: