వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అందరికి తెలిసిందే.  జగన్ తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నాయి.. కానీ, ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులకు మాత్రం నచ్చడం లేదు.  పార్టీలు వేరైనపుడు.. ప్రతి పక్షంలో ఉండే పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు చేసే పనులను వ్యతిరేకిస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు.  గతంలో కూడా ఇలానే జరిగింది.  జగన్ కూడా ఇలానే వ్యతిరేకించాడు.  కాకపోతే, అన్నింటిని అయన వ్యతిరేకించిన దాఖలాలు లేవు.  

 

ఏవో కొన్ని మాత్రమే వ్యతిరేకించారు.  కానీ, ఇప్పుడు లోకేష్ అలా కాదు.  ప్రతి దానిని అయన వ్యతిరేకిస్తున్నారు.  నచ్చినా నచ్చకున్నా సరే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకించాలి.  కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అనే రీతిలో మాట్లాడుతున్నాడు.  అలానే ప్రవర్తిస్తున్నాడు.  రైతు భరోసాపై వ్యతిరేకించారు.  పింఛన్ పథకంపై వ్యతిరేకించారు.. ఇప్పుడుఇంగ్లీష్ స్కూల్స్ ను వ్యతిరేకిస్తున్నారు.  


ఇంగ్లీష్ స్కూల్స్ పేరుతో తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని,  భవిష్యత్తులో తెలుగురాక విద్యార్థులు అవస్థలు పడతారని లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయం తెలియాలి.  గతంలో తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్తే.. వైకాపా వ్యతిరేకించింది.  కానీ, ఇప్పుడు అదే వైకాపా ఇంగ్లీస్జ్ మీడియం స్కూల్స్ ను ఎలా అనుమతి ఇస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.  


వైకాపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పధకాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా పెట్టుకున్నది తెలుగుదేశం. వ్యతిరేకిస్తుంది సరే.. దాని కోసం పోరాటం చేస్తేనే కదా అసలు ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవసరం ఉన్నదా లేదా అన్నది తెలిసేది.  అలాంటివి ఏమి చేయకుండా కేవలం పధకాలు ప్రవేశపెడుతున్నారు.. మేము వ్యతిరేకిస్తున్నాం అంటే ఎలా సరిపోతుంది చెప్పండి. వీటితో పాటుగా లోకేష్ మద్యపాన నిషేధంపై కూడా మండిపడిన సంగతి తెలిసిందే.  గ్రామాల్లో బెల్ట్ షాపులు అధికంగా నడుస్తున్నాయని లోకేష్ అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: