ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రెండు నెలల నుండే చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలు మొదలుపెట్టేశారు. అందుకు కారణాలు ఏమిటి ? తొందరలోనే ఉపఎన్నికలు వస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఉపఎన్నికల్లో పార్టీ తరపున అసలు పోటికి ఎవరైనా ముందుకొస్తారా అని తెలుసుకోవటానికే పర్యటనలు ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

 

నిజానికి పార్టీ పరంగా గట్టి నేతలు ఎవరు లేరనే చెప్పాలి.  ఉన్నవారిలో కూడా ఎన్నికల్లో పోటి చేయటానికి బాగా వెనకాడుతున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో తిన్న దెబ్బ నుండి ఇంకా చాలామంది టిడిపి నేతలు కోలేకోలేదు. పైగా చంద్రబాబు నాయకత్వం మీద చాలామంది నేతలకు నమ్మకం కూడా పోయింది. దాంతో ఎవరికి అవకాశం ఉన్నంతలో ఇతర పార్టీల్లోకి దూకేయటారికి రెడీ అయిపోతున్నారు.

 

ఇప్పటికే రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్, సిఎం రమేష్ లను స్వయంగా చంద్రబాబే బిజెపిలోకి పంపేశారనే ప్రచారం ఉంది. దానికి తోడు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, మాజీ ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, చందు సాంబశివరావు, ప్రకాశం  జడ్పి మాజీ ఛైర్మన్ అన్నె హరిబాబు లాంటి మరికొందరు బిజెపిలో చేరారు.

 

ఇక తెలుగుయువత మాజీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎంఎల్ఏ వీర శివారెడ్డి, విశాఖడైరీ ఛైర్మన్ కిడారి ఆనందకమార్ లాంటి వాళ్ళు వైసిపిలో చేరారు. తొందరలోనే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా చేరబోతున్నారు. ఇక ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు లాంటి కొందరు ఎంఎల్ఏలు తొందరలోనే బిజెపిలో చేరబోతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.

 

సుమారు 10 మంది ఎంఎల్ఏలు గనుక టిడిపిని వదిలేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఎగిరిపోతుంది. ఇటువంటి పరిస్ధితుల్లో రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయటానికి పార్టీ తరపున గట్టి నేతలు ముందుకొస్తారా ? అన్నదే సందేహం. పైగా ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లొచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పై సానుకూలత మరింత పెరిగింది. ఈ పరిస్ధితుల్లో  పార్టీ పరిస్ధితేంటో తెలుసుకునేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారా అన్న అనుమానం పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: