డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  జాగ్రత్తలు తీసుకుంటేనే గమ్యస్థానానికి చేరుకుంటాం.  లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  డ్రైవింగ్ చేసే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.  అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో వేరే దీనిపై కూడా దృష్టి పెట్టకూడదు.  


అయితే, ఇటీవల కాలంలో టిక్ టాక్ కు అలవాటు పడిన చాలామంది వాళ్ళ విచిత్రమైన అలవాటుతో ప్రజలను ఇబ్బందులను పెడుతున్నారు.  టిక్ టాక్ ను చూడగానే లోకాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు.  అందుకు ఒక ఉదాహరణ ఇది.  కేరళకు చెందిన ఓ బస్సు డ్రైవర్ ముగ్గురు అమ్మాయిలకు బస్సు గేర్ రాడ్డు అప్పగించారు. 


ఆ ముగ్గురు యువతులు బస్సు గేర్ రాడ్డును ముందుకు వెనక్కి లాగుతూ గేర్లు మారుస్తూ టిక్ టాక్ చేశారు.  బస్సు డ్రైవర్ అలర్ట్ గానే ఉన్నారు.  కానీ, జరగరాని పొరపాటు ఏదైనా జరిగి.. బస్సు యాక్సిడెంట్ జరిగితే.. పరిస్థితి ఏంటి.. బస్సులో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ ఇస్తారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  


టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బస్సు డ్రైవర్ వెలుగులోకి వచ్చాడు.  కేరళ రోడ్డు రవాణా సంస్థ ఆ డ్రైవర్ పై చర్యలు తీసుకున్నది. ఆరు నెలలపాటు అతని లైసెన్స్ ను రద్దు చేసింది.  అమ్మాయిలుబాగున్నారని, వారు అడిగారని టిక్ టాక్ చేస్తే.. ఇప్పుడు అతని ఉద్యొగానికి ఎసరు పడింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది.  విషయం మరుగున పడింది.  అదే ప్రమాదం జరిగి ఉంటె.. ఈపాటికే పెద్ద రాద్ధాంతం జరిగేది. విద్యార్థులతో కలిసి కేరళ నుంచి గోవాకు వెళ్తుండగా ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. వీడియోలో ఉన్న డ్రైవర్‌ను వయనాడ్‌కు చెందిన ఎం.షాజీగా గుర్తించారు  

మరింత సమాచారం తెలుసుకోండి: