మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు 25 రోజులు దాటినా ఇంత వరకూ ప్రభుత్వం ఏర్పడలేదంటేనే అర్ధమైపోతోంది సంక్షోభం ఏ స్ధాయిలో ఉందో. తాజాగా బద్ధ శతృవైన ఎన్సీపి అధినేత శరద్ పవార్ ను ప్రసన్నం చేసుకోవటానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే రంగంలోకి దిగాల్సొచ్చింది. మోడి-పవార్ భేటి

 

నిజానికి బిజెపి+శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాడాల్సింది. కానీ ముఖ్యమంత్రి కుర్చీపై శివసేన పట్టుబట్టడంతో  వ్యవహారం తేలలేదు. దాంతో బిజెపిని పక్కనపడేసి కాంగ్రెస్, ఎన్సీపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి శివసేన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ముందు ప్రభుత్వం ఏర్పాటు అయిపోతుందనే అనుకున్నా చివరి నిముషంలో ఎన్సీపి, కాంగ్రెస్ వెనకాడటంతో ఆశలు ఆవిరైపోయాయి.

 

ఇదే అదనుగా బిజెపి పావులు కదుపుతోంది. ఎన్సీపి అద్యక్షుడు పవార్ ను ఉచ్చులోకి లాగుతోంది.  ప్రభుత్వ ఏర్పాటులో  తమతో చేతులు కలిపితే రాష్ట్రపతి పదివిని పవార్ కు బిజెపి ఆఫర్ చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ పవార్ చేతులు కలిపినా పవార్ కు అధక్షపదివి దక్కేది మాత్రం నాలుగేళ్ళ తర్వాతే. అప్పటికి రాజెవరో ? రెడ్డెవరో ? ఎవరు చెప్పగలరు ?

 

ఒకవేళ బిజెపి+ఎన్సీపిలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎంతకాలం ఉంటుందో చెప్పలేకున్నారు. ఎందుకంటే 288 సీట్ల అసెంబ్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా  కనీసం 145 సీట్లుండాలి. బిజెపికున్న 105 సీట్లు, ఎన్సీకి ఉన్న 54 సీట్లు కలిపితే ఇప్పటికి బలమున్నట్లే. కానీ ఏ విషయంలో అయినా విభేదాలు తలెత్తితే మాత్రం ప్రభుత్వానికి ఆయువు మూడినట్లే లెక్క.

 

అంటే ఎవరి కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా ముడునాళ్ళ ముచ్చటగానే అయిపోతుంది. కాబట్టి ఈ సంక్షోభానికి రెండే పరిష్కార మార్గాలు కనబడుతున్నాయి. మొదటిది వీలున్నని రోజులు రాష్ట్రపతి పాలన విధించటం. లేకపోతే వీలైనంత తొందరలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించటం. మరి ఈరోజు మోడి-పవార్ భేటి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: