ఆర్టీసీ సమ్మె... తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం . 45 రోజులకు పైగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపడుతున్నప్పటికే చివరకు తమ డిమాండ్ల పరిష్కారం వైపు ప్రభుత్వం మొగ్గు చూపలేదు. అంతే కాకుండా ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుంది . ఈ నేపథ్యంలో ఇప్పటికే 45 రోజులకు పైగా  ఆర్టీసీ సమ్మె చేరుకోవటంతో సమ్మె భవితవ్యం ఏమిటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. హైకోర్టులో తమకున్యాయం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు అక్కడ కూడా న్యాయం జరిగలేదు . ఆర్టీసీ సమస్యను పరిష్కరించలేమంటూ  హైకోర్టు కూడా తేల్చి చెప్పేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని తమ చెప్పలేము అని ఆర్టీసీ సమస్యను  లేబర్ కోర్టుకు  రిఫర్ చేయాలంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. 

 

 

 

 హైకోర్టు తీర్పుతో ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు నిన్న నిర్వహించాలని తలపెట్టిన  సడక్ బంద్ అని కూడా వాయిదా వేయడంతో ఆర్టీసీ కార్మికులు ఇక చేసేదేమీలేక సమ్మె విరమిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ సమ్మె యాధాతదంగా  కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే... అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి గీతారెడ్డి స్పందించారు. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణం అంటూ ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారు అంటూ గీతారెడ్డి ఆరోపించారు.

 

 

 

 ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో దీనిపై చొరవ చూపి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి సహా పలువురు నాయకులు గవర్నర్ తమిళ సై ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు అని ఆరోపించిన విపక్షాలు... విపక్షాలన్నీ ఆర్టీసీ కార్మికుల తో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ ఐఏఎస్ అధికారి కోర్టులో అఫిడవిట్  దాఖలు చేయటాన్ని  గీతారెడ్డి తప్పుబట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం విషయంలో చొరవ చూపాలని అంతేకాకుండా దీనిపై కేంద్రంతో పాటు రాష్ట్రపతిని కూడా కలుస్తామంటూ  విపక్ష నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: