స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యర్ధులు బురదచల్లటంలో పోటి పడతున్నట్లే ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక విధంగా మాట్లాడుతారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మరో విధంగా ఎగిరెగిరి పడుతున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే ప్రతిరోజు రెచ్చిపోతూనే ఉంది. దారులేవైనా జగన్ పై బురదచల్లటం అన్నదే ప్రత్యర్ధుల కామన్ పాయింట్ అయిపోయింది.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం జగన్ ఎందుకు ప్రవేశపెడుతున్నారయ్యా అంటే మత మార్పిడుల కోసమే అని కన్నా సెలవిస్తున్నారు. మరి ఈయన అనుభవం, వయస్సు, జ్ఞానమంతా ఏమయ్యిందో అర్ధం కావటం లేదు. మత మార్పిడుల కోసమే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటమన్నదే నిజమా ? ఒకవేళ నిజమే అనుకుంటే మరి ఇంగ్లీషు మీడియంలో చదవిన కన్నా కొడుకు క్రిస్తియన్ గా మారిపోయారా ?

 

ఇప్పటికి వేలాది ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లోనో లేకపోతే మిషనరీ స్కూళ్ళల్లోనో చదివిన కోట్లాదిమంది క్రిస్తియన్లుగా ఎందుకు మారలేదు ?  మిషనరీ స్కూళ్ళల్లో టీచర్లు అందరూ క్రిస్తియన్లేనా ? కాకపోతే వారెందుకు ఇంకా మారలేదు ? 

 

ఇక ఓ ఎల్లోమీడియా  అయితే ఇంగ్లీషు మీడియంలో చదివిన వాళ్ళని క్రిస్తియన్ లుగా మార్చటం సులభమన్నట్లుగా  రాసేసింది. బిసిలను క్రిస్తియన్లుగా మార్చటం చాలా సులభమని కూడా తేల్చేసింది.  మరి బిసిల గురించి రాసిన సదరు ఎల్లోమీడియా మిగిలిన కులాలను ఎందుకు వదిలేసిందో అర్ధం కావటం లేదు.

 

మీడియా యజమాని పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదివే ఉంటారు. మరి వాళ్ళు తమ మతాన్ని మార్చేసుకున్నారా ? ఇక్కడ విషయం ఏమిటంటే స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది జగన్ కాబట్టి వ్యతిరేకించాల్సిందే. ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించటమే అన్న గుడ్డి ఆలోచనలో ఉన్నంత వరకు వీళ్ళను ఎవరూ మార్చలేరు. జనాల్లో జగన్ పై సానుకూలత ఉన్నంత వరకూ అవసరమైనపుడు మళ్ళీ వీళ్ళకు బుద్ధి చెప్పకమానరంతే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: