కొన్నాళ్లుగా సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల విష‌యం కోర్టుకు చేరిన విష యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లో ఉన్న మునిసిపాలిటీలు, స్తానిక సంస్త‌ల్లో ప్ర‌భు త్వం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై కొన్నాళ్ల కింద‌ట హైకోర్టు చీవాట్లు పెట్టింది. మీ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ హైకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టింది. ఆర్టిక‌ల్ 73 స‌వ‌ర‌ణ‌ ప్ర‌కారం  ద‌ఖ‌లు ప‌డిన స్తానిక సంస్థ‌ల అధికారాల‌ను ఎలా తొక్కి పెడ‌తారంటూ.. ప్ర‌శ్నించింది.

 

అయితే, దీనికి ప్ర‌భుత్వం కూడా కౌంట‌ర్ ఇచ్చింది. రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కాలేద‌ని, ఇది పూర్తికాగానే మొద‌లు పెడ‌తామ‌ని చెప్పింది. దీనికి సంతృప్తి చెందిన హైకోర్టు మూడు మాసాల్లో అంటే డిసెంబ‌రులోగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఇంత‌లోనే కొన్ని పంచాయ తీల్లో రిజ‌ర్వేష‌న్ ర‌గ‌డ‌కు దారితీసింది. దీంతో మ‌రోసారి ఈ విష‌యం హైకోర్టుకు వెళ్లింది. 

 

దీనిని విచారించిన సింగిల్ జ‌డ్జి స్టే విధించారు. విష‌యం తేలే వ‌ర‌కు ఎన్నిక‌ల‌ను ఆపాల‌ని కోరారు. దీంతో మ‌రోసారి పంచాయతీ ఎన్నిక‌లు నిలిచిపోయిన‌ట్ట‌యింది. దీంతో మ‌రోసారి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖ‌ల‌య్యాయి. కొన్ని పంచాయ‌తీల్లో ఏర్ప‌డిన శూన్య‌త‌ను అడ్డు పెట్టుకుని మొత్తం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌నే నిలుపుద‌ల చేయ‌డం స‌రికాద‌ని, సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాల‌ని కోరుతూ.. హైకోర్టును అభ్య‌ర్తించారు. 

 

ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ ప్రారంభించిన హైకోర్టు ఈ రోజు అంటే బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2.30 తర్వాత విచారించేందుకు అంగీక‌రించింది. ఈ తీర్పు ఆధారంగా తెలంగాణలో వ‌చ్చే డిసెంబ‌రులోగా మునిసిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి ప్ర‌భుత్వం కూడా మునిసిప‌ల్ ఎన్నిక‌లకు సిద్ధ‌మైన త‌రుణంలో ఎలాంటి తీర్పు వ‌స్తుందో చూడాలి. ఇక ఎన్నిక‌ల‌కు లైన్ క్లీయ‌ర్ అయితే తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల కోలాహాలం మొద‌లైన‌ట్టే..! ఇప్ప‌టికే అక్క‌డ అధికార టీఆర్ఎస్ దెబ్బ‌కు ప్ర‌తిప‌క్షాలు నీర‌సించి పోయాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల‌కు అవి ఎలా ఎదుర్కొంటాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: