మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ) లీడర్ శరద్ పవార్ ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి మోదీని పార్లమెంట్ లో కలిశారు. మహారాష్ట్రలో రైతుల సమస్యలపై  మోదీతో పవార్‌ చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా ప్రధానికి పవార్‌ ఒక లేఖను అందజేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని దానిలో ప్రస్తావించారు. 

 


కానీ శరద్ పవార్ రైతుల సమస్యల గురించి మోదీతో మాట్లాడడానికే భేటీ అవుతున్నాని చెప్పినప్పటికీ శరద్ పవార్ సమావేశం వెనుక ఒక ఎజెండా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చాలా రోజులవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాపోవడానికి కారణం.. శివసేన పార్టీ తమకి 2.5 సంవత్సరాలు పాటు అధికారాన్ని ఇవ్వాలంటూ బీజేపీని డిమాండ్ చేయడం. అయితే దీనికి బీజేపీ అంగీకరించకుండా ఆడండి బిడ్డ ఆడండి ఎన్ని రోజులు ఆడతారో మీ ఆటలు ఆడండి అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తుంది. 

 

అయితే శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్.. మేము ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం... శివసేన యువనేత ఆదిత్యఠాక్రేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పృథ్వీ చవాన్‌, అశోక్‌ చవాన్‌లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారే. ఎన్సీపీలోని అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఇరువురి పార్టీ వాళ్లకు రాజకీయ అనుభవం లేని ఆదిత్యఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అతని కింద పని పనిచేయాల్సివస్తోందోమోననే ఊహనే రుచించట్లేదట. 

 

మొన్న ఈ మధ్య మోదీ ఎన్సీపీ గురించి మాట్లాడిన తీరును గమనించి బిజెపి ఎన్సీపీ వాళ్లతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందేమో అని రాజకీయ వర్గాలు రకరకాల ఊహాగానాలు చేసుకుంటున్నారు. బీజేపీతో కలిస్తే సిబిఐ, ఈడీ లా కేసుల నుండి సురక్షితంగా ఉండొచ్చని ఎన్సీపీ భావిస్తోందని సమాచారం. ఒకవేళ 105 ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి ఎన్సీపీ తో కలిస్తే మెజారిటీ మార్క్ ను దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇదే జరిగితే సీనియర్ లీడర్ అయిన శరద్ పవార్ కి పోయేదేమీ లేదు..బాగా నష్టపోయేది ఎవరంటే అది కేవలం శివసేన పార్టీయే. శరద్ పవార్ బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తారా, లేదా అనేది రేపు మధ్యాహ్నం లోపు స్పష్టమవుతుందని రాజకీయ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: