మొన్నటి వరుకు భారీ వర్షాలతో నగరాల్లో ప్రజలను గ్రామాలలో రైతులను కష్టాలు పెట్టిన వర్షాలు మళ్ళి వస్తున్నాయి. ఈసారి వర్షాలు వస్తే మాములుగా ఉండదు అన్నట్టు వర్షాలు రావడానికి సిద్దమవుతున్నాయట. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అక్కడడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 

          

తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుండి చలి గాలులు వీస్తున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని. కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

           

అయితే రాయలసీమలో మాత్రం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని ఈ సందర్భంగా వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇప్పటికే వచ్చిన వర్షాల కారణంగా ఇప్పటికే రతులు పంట నష్టమై ఇబ్బంది పడుతున్నారు. 

              

ఇప్పుడు మళ్ళి భారీ వర్షాలు అని అంటుంటే రైతులు వణికిపోతున్నారు. కాగా నగరంలో కూడా చిన్న చిన్న వర్షాలకు రోడ్లు అన్ని గుంతలు పడి ట్రాఫిక్ లో గంటల తరబడి ఉండాల్సి వస్తుంది అని నగరవాసులు కూడా భయపడుతున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అన్ని వచ్చేస్తున్నాయి. మరి రెండు రోజుల పాటు ఎంతమాత్రం వర్షాలు కురుస్తాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: