తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దేవాలయాల పాలక మండళ్ల సభ్యుల భర్తీలో దూకుడు ప్రదర్శించారు. తిరుపతిలోని నాలుగు ఆలయాల పాలకమండళ్లకు, ఒక్కో ఆలయానికి ఆరుగురు  సభ్యులను నియమింపజేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ పద్మ నుంచి ఉత్తర్వులు తెప్పించారు.  తిరుపతి నగరంలోని అంకాలమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎం.నరసింహులు, ఎం.శివ, ఎం.కృపావతి, ఇ.లక్ష్మి, ఇ.యశోద, పి.మురళి నియమితులయ్యారు. తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యులుగా ఎస్.బాలకృష్ణ, టి.ఉమామహేశ్వరి, పి.అనిల్, హేమావతి, వెంకటరమణ, పద్మజలను నియమించారు. 

 

 వేషాలమ్మ ఆలయ ఆలయ పాలకమండలి సభ్యులుగా అమృతాచారి, వేణుగోపాల్, అశోక్, నాగమణి, మస్తానమ్మ, పద్మ. అలాగే కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా జె.శరత్కుమార్ శివశంకర్, రెడ్డెమ్మ, నాగయ్య, అనురాధ, పుష్పలతను నియమించారు.  పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ఆధ్యాత్మికతకు సంబంధించిన దేవాలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ర్టంలోనే మొట్టమొదటగా కరుణాకర రెడ్డి చొరవ చూపారు. హిందువులకు అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల కావడంతో ఇక్కడి నుంచి నియామకాలు ప్రారంభిస్తే రాష్ర్ట వ్యాప్తంగా కూడా అన్నీ సక్రమంగా జరుగుతాయని కరుణాకరరెడ్డి  సెంటిమెంట్.  ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని సి ఎం జగన్ ఆదేశాల మేరకు, మిగతా దేవాలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు జరుగుతాయని తెలిపారు.

 

 ఈ దేవాలయ పాలక మండళ్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయవలసిన అవసరం చాలా వున్నదని, ఈ పాలకమండళ్లు ద్వారా దేవాలయాల అభివృద్ధి పర్యవేక్షణ త్వరితగతిన  జరుగుతాయని,పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, నేతలను గుర్తించి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ స్ఫూర్తితో పదవుల పంపకం చేపట్టినట్టు కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: