హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై, హైకోర్టు తీర్పుపై సమాలోచనలు చేస్తున్నారు. జేఏసీ నేతలు ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మరలా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు సమ్మె కొనసాగించాలా...? వద్దా...? అనే అంశం గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. 
 
ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న కార్మికులతో వేరువేరుగా సమావేశమై చర్చలు జరిపాయి. కార్మికుల అభిప్రాయాలను సేకరించిన తరువాత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈరోజు చర్చలు జరిపారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులలో మెజారిటీ కార్మికులు సమ్మె కొనసాగించటానికే మొగ్గు చూపారని అశ్వత్థామరెడ్డి మీడియాకు తెలిపారు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తుది నిర్ణయం కార్మిక కోర్టు తీర్పును పరిశీలించిన తరువాతే తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను సాధించుకోవటం కొరకు దాదాపు నెలన్నర రోజుల నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరింది. మరోవైపు తెలంగాణ విపక్ష నేతలు ఈరోజు గవర్నర్ తమిళి సైని కలిశారు. బీజేపీ నేత మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సమస్యను పరిష్కరించాలని గవర్నర్ ను కోరామని అన్నారు. 
 
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని త్వరలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కూడా కలుస్తామని చెప్పారు. మాజీ కాంగ్రెస్ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ సమ్మె ప్రారంభమై 46 రోజులు దాటినా సమ్మెను పరిష్కరించటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదని అన్నారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గీతారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ నేత venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ సమయం ఇస్తున్నా కేసీఆర్ తమకు సమయం ఇవ్వడం లేదని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: