2019 అక్టోబర్ 21 వ తేదీన మహారాష్ట్రకు ఎన్నికలు ముగిశాయి.  ఈ ఎన్నికలు ముగిసిన తరువాత అక్టోబర్ 24 వ తేదీన రిజల్ట్ వచ్చాయి.  శివసేన - బీజేపీ కలిసి పోటీ చేయగా శివసేనకు 54, బీజేపీకి 105 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 53 స్థానాల్లో విజయం సాధించింది.  అయితే, ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, శివసేన పార్టీల మధ్య గొడవ రావడంతో రెండు పార్టీలు విడిపోయాయి.  
శివసేన అధికారం కోసం బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ - ఎన్సీపీతో దోస్తీ కట్టేందుకు సిద్ధం అయ్యింది.  ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది.  అయితే, డిసెంబర్ నెలలోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన, ఎన్సీపీ భావిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్సీపీ తీసుకునే నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నది.  కానీ, ఎన్సీపీమాత్రం శివసేనను నమ్మాలా వద్దా అనే ఆలోచనలో పడింది.  
ఇంతవరకు శివసేనతో అధికారం పంచుకునే విషయం గురించి చర్చించలేదని, సంఖ్యాబలం గురించి మాత్రమే చర్చించినట్టు చెప్తున్నారు.  ఎవరికీ ఎన్ని సీట్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రి పదవి ఎవరికీ ఇవ్వాలి అనే వాటిపై ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు.  దీనిపై ఇంకా చర్చ జరగలేదని, ఇంకా సమయం ఉందని ఎన్సీపీ చెప్తున్నది.  శివసేన మాత్రం ఆత్రంగా పదవిలో కూర్చోవాలని తహతహలాడుతోంది.  
ఇదిలా ఉంటె, ఈరోజు మహారాష్ట్రలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేన పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీతో కలిసేందుకు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది.  17 మంది శివసేన ఎమ్మెల్యేలు ఈ విషయంలో పూర్తిగా విభేదిస్తున్నారు. వెంటనే శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారట. వెంటనే ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారు అనే విషయంపై క్లారిటీ లేకున్నా ఎందుకు ఏమిటి అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.  రేపు మధ్యాహ్నంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చిన కాసేపటికే ఎమ్మెల్యేలు ఇలా ప్లేట్ ఫిరాయించడంతో శివసేన అయోమయంలో పడిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: