ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల వరకు రూ.31,748 కోట్ల రెవెన్యూ వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.24,982 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, జీఎస్టీ ఆదాయాన్ని రూ.15,253 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.12,351 కోట్లు వచ్చాయి. జీఎస్టీలో పెట్టుకున్న టార్గెట్‌కు గాను 80 శాతానికి పైగా వసూలు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలపై రెవెన్యూను టార్గెట్‌గా పెట్టుకుంది.

 

             పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ.525 కోట్లకు పైగా తగ్గింది. జీఎస్టీ, పెట్రోలియం, లిక్కర్, వృత్తి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ.35.39 కోట్లు మాత్రమే పెరిగింది. జీఎస్టీ ఆదాయం 1.91 శాతం, లిక్కర్‌పై 5 శాతం పెరిగింది. పెట్రో ఆదాయం అందుకే తగ్గింది. గత ఏడాది కాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దీంతో వాహనాల సేల్స్ తగ్గిపోయాయి.  దీంతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గి, పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గిపోయింది. మొత్తంగా పన్నురూపంలో వచ్చే పెట్రో ఆదాయం రూ.525 కోట్ల వరకు తగ్గింది.పెట్రోలియం ఉత్పత్తులపై రెవెన్యూ టార్గెట్ రూ.8,358 కోట్లు కాగా రూ.5,965 కోట్లు వచ్చాయి.

 

                  లిక్కర్ ఆదాయం రూ.8,015 కోట్లు కాగా, రూ.6,540 కోట్లు వచ్చాయి. వృత్తి పన్ను రూ.120 కోట్లు కాగా, ఆదాయం రూ.124 కోట్లు వచ్చింది. అద్దెలు, లీజుల ద్వారా గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త బార్ల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ రానుంది.

                   

                   ప్రస్తుతం దాదాపు ఎనిమిది వందల బార్లు ఉండగా, వాటిలో 40 శాతం తగ్గించనుంది. జనవరి 1వ తేదీ నాటికి కొత్త విధానం అమలు చేయనుంది. బార్ల సంఖ్యను ఈ విధానంలో 479కి పరిమితం చేయనుంది. అలాగే, దరఖాస్తు, లైసెన్స్ ఛార్జ్ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచనుంది. కొత్త వాటిని లాటరీ ద్వారా కేటాయిస్తారు. దీంతో బార్లలో మద్యం ధర మరింత ఖరీదు కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: