దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా అంశం తెరమీదకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెంచుకుంటూ పోతుంది  సినిమా. ఎందుకంటే ఓటమి ఎరుగని దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు... బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్  తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు అంతకుమించి అన్నంతగా  అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం  బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది . ఇప్పటి వరకు చరిత్రలో కలవని వీరులు  అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్‌ లు  ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనే విభిన్న కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు నటిస్తుండగా... కొమరం భీమ్‌ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 

 

 

 

 అయితే రాజమౌళి సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా  వేయికళ్ళతో ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాలో  రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఎంపిక  చేసిన దర్శకుడు రాజమౌళి... జూనియర్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ ను  ఎంచుకున్నారు. అయితే కొన్ని ఫ్యామిలీ సమస్యల  కారణాల ద్వారా ఈ సినిమా నుంచి డైసీ ఎడ్బర్గ్   తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక చేయలేదు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు వరకు హీరోయిన్ ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ సరసన ఎవరు నటించబోతున్నారని దానిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీ ని  ఎంచుకున్నారు దర్శకుడు రాజమౌళి. కాగా  ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో దర్శకుడు రాజమౌళి అమెరికన్ అమ్మాయినే  మరోమారు ఎంచుకున్నారు. ఈ విషయంపై తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది విచిత్రబంధం. 

 

 

 

 మొన్నటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ తో  సన్నివేశాలను చిత్రీకరించిన రాజమౌళి ఇప్పుడు రామ్ చరణ్ తో చిత్రీకరణ బిజీగా ఉన్నారు. బల్గెరియాలో  రామ్ చరణ్ ఎన్టీఆర్ కోసం ఒక ప్రత్యేక షెడ్యూల్ ను  జక్కన్న ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అక్కడ షూటింగ్ చేసేందుకు చిత్ర బృందం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక కూడా అయిపోవడంతో... ఎన్టీఆర్ ఓవిలియ   సన్నివేశాల చిత్రీకరణ వేగంగానే జరగనుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతంకు పూర్తి అయినట్లు ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా జులై 30,  2020 న విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: