మారుతున్న కాలంలో వివాహం జరగాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బజాజ్ ఫిన్ సర్వ్ పెళ్లి చేసుకునేవారి అవసరాలకు తగినట్లుగా ఘనంగా వివాహం చేసుకోవటానికి అప్పు ఇస్తామని చెబుతోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన బజాజ్ ఫిన్ సర్వ్ 25 లక్షల రూపాయల రుణం పెళ్లి ఖర్చుల కొరకు ఇస్తోంది. సులభ వాయిదా పద్ధతి ద్వారా ఈ రుణాలను తిరిగి చెల్లించవచ్చు. 
 
ఈ రుణం పొందటానికి ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. బజాజ్ ఫిన్ సర్వ్ ఇచ్చే రుణంతో విందు, నగలు, ఫోటోగ్రాఫర్, ఫంక్షన్ హాల్, హనీమూన్ ఖర్చులను చెల్లించవచ్చు. రుణం తీసుకున్న రోజు నుండి 5సంవత్సరాల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ ఫిన్ సర్వ్ ఫ్లెక్సీ లోన్ అనే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఫ్లెక్సీ లోన్ ను పొందినవారు ఎంత రుణం మంజూరు అయిందో ఆ రుణంలో ఉపయోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. 
 
అవసరమైన మేరకు మాత్రమే రుణాన్ని వాడుకునే వెసులుబాటు ఫ్లెక్సీ లోన్ కు ఉంది. ఈ రుణాన్ని పొందాలనుకునేవారు ఖచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి. పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలలో లేదా బహుళ జాతి కంపెనీలలో పని చేస్తూ ఉండాలి. రుణం తీసుకునేవారి వయస్సు 23 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీ ప్రతినిధులు రుణం తీసుకునేవారు నివశిస్తున్న ప్రాంతం మరియు రుణం తీసుకునేవారి నెల వేతనం ఆధారంగా ఎంత రుణాన్ని మంజూరు చేయాలనే విషయాన్ని నిర్ధారిస్తారు. 
 
చాలామంది పెళ్లి ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. బజాజ్ ఫిన్ సర్వ్ అర్హతను బట్టి 25 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తూ ఉండటంతో ఎక్కువమంది ఈ రుణం పట్ల ఆసక్తి చూపే అవకాశం ఉంది. తనఖా లేకుండా రుణం పొందటమే కాకుండా సులభ వాయిదా పద్ధతుల ద్వారా చెల్లించే అవకాశం ఉండటం రుణాలు తీసుకునే వారికి మేలు చేసే అంశంగా చెప్పవచ్చు. ఈ రుణానికి సంబంధించిన వడ్డీ రేట్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: