ఆధార్ కార్డు, సోషల్ మీడియా ఈ కాలంలో ప్రతిఒక్కరికి ఉంటాయి. సారీ సారీ.. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ సోషల్ మీడియా ప్రస్తుతం అందరికి ఉండకపోవచ్చు. అయితే ఆధార్ కార్డు ఒక్కరికి ఒక్క కార్డు మాత్రమే ఉంటుంది. కానీ సోషల్ మీడియా ఒకొక్కరికి ఎన్ని మెయిల్ అకౌంట్లు ఉంటె వారికి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి.      

 

ఆ ఫేక్ మెయిల్ అకౌంట్స్ తో క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వీటితో చాలామంది చాల రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అయితే ఆధార్ కార్డుతో ఇప్పటికే బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ అనుసంధానం చేసేశారు. అలానే సోషల్ మీడియాను అదుపు చెయ్యాలంటే ఆధార్ లింక్ చెయ్యాలని.. అందుకు ఆధార్ తో సోషల్ మీడియాను అనుసంధానం చేస్తారని అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి.       

 

ఈ సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈరోజు స్పష్టం చేశారు. ఆధార్‌ సమాచారం పూర్తి భద్రతతో కూడుకున్నదని దీనిపై తరచుగా ఆడిటింగ్‌ జరుగుతు ఉంటుంది అని పార్లమెంట్‌లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఐటీ చట్టం సెక్షన్‌ 69 ఏ కింద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని అయన చెప్పారు.

       

కాగా 2016 నుంచి 2019 వరకూ ప్రభుత్వం దాదాపు 8500 వరకూ యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేసిందని ఈ సందర్భంగా అయన వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లు సోషల్ మీడియాతో ఆధార్ అనుసంధానం అనే గాసిప్ కి ఈరోజు తెర పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: