ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 47 రోజులుగా సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోందని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేసుకున్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. హైకోర్టు కార్మికుల సమస్యలు లేబర్ కోర్టు పరిధిలోకి వస్తాయని ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు సూచనల మేరకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. 
 
హైకోర్టు కొన్ని సూచనలు చేయటం జరిగిందని తీర్పును ఆర్టీసీ కార్మికులందరూ గౌరవిస్తున్నారని చెప్పారు. కార్మికులు విధులకు హాజరైతే కార్మికుల ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యంపై ఉందని షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. యాజమాన్యం, ప్రభుత్వం విధులకు ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఆహ్వానిస్తే సత్వరమే సమ్మె విరమించాలని జేఏసీ నిర్ణయం తీసుకున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 
 
ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన పరిస్థితులలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి చర్యలు చేపట్టాలని కోరుతున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందిస్తే సమ్మె విరమిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. జడ్జీల తీర్పును ఉల్లంఘించలేమని అన్నారు. సమస్యలను లేబర్ కోర్టు పరిష్కరిస్తుందనే నమ్మకం తమకుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. 
 
అన్ని డిమాండ్లను లేబర్ కోర్టుకు పంపామని లేబర్ కోర్టు సమస్యలను పరిష్కరిస్తుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఉన్న పరిస్థితులే ఉండాలని మేమే ముందుగా స్పందించి విధుల్లో జాయిన్ కావటానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం త్వరగా స్పందిస్తుందని నమ్మకం ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఎలాంటి షరతులపై సంతకం ఆర్టీసీ కార్మికులు పెట్టరని అశ్వత్థామరెడ్డి అన్నారు. కానీ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నాయకులు తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో ఎట్టి పరిస్థితులలోను ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గినా ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా అంటే అనుమానమే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: