గత 47 రోజులు గా సాగిన ఆర్టీసి సమ్మె కు బ్రేక్ పడింది. అటు ప్రభుత్వం ఇటు కార్మికులు సమ్మె పై వెనక్కి తగ్గకపోవడంతో హై కోర్టు లో ను కేసు నడిచింది సుదీర్ఘంగా కొనసాగిన ఆర్టీసి సమ్మె లో చివరికి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది.  

       

           హైదరాబాద్‌ విద్యానగర్‌ ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతల సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘ ఆదర్శవంతమైన యజమానిగా కార్మికులను చూస్తారని భావిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. ఆర్టీసీ ప్రతిష్ట ఇనుమడింపజేయడంలో కార్మికుల పాత్ర కీలకం. ప్రశాంతవాతావరణంలో ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. అక్టోబరు 4కు ముందు ఉన్నవిధంగా కార్మికులను విధుల్లోకి ఆహ్వానించాలి.  ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే  సమ్మె విరమిస్తాం’’ అని స్పష్టం చేశారు.

 

            సమ్మె విషయమై లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారని సమాచారం. సమ్మె, ప్రయివేటీకరణ అంశాలపై అడిషనల్ అఫిడవిట్ ను ఆర్టీసీ, ప్రభుత్వం ధాఖలు చేశాయి. ఈ అఫిడవిట్ లో.. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రతి పక్షాలు, యూనియన్లు పన్నాగం పన్నారని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం అన్ని, ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించడం కష్టం అని భావించి కార్మికులు సమ్మె విరమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: