47 రోజులుగా కొన‌సాగుతున్న  ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమిస్తామని, ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ``అనుకూల వాతావరణం కల్పిస్తే విధుల్లో చేరతాం. విధుల్లో చేరిన కార్మికులపై చర్యలు తీసుకోకూడదు. సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో కల్పించాలి. సమ్మె ఉద్దేశ్యం సమస్యల పరిష్కారమే. విధులను విడిచిపెట్టడం కార్మికుల ఉద్దేశ్యం కాదు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి చర్యలు లేకుండా విధుల్లోకి తీసుకోవాలి.`` అని కోరారు.

 

కార్మికులు సమ్మెకు వెళ్లడంపై ఇప్పటికీ సీఎం సీరియస్ గా ఉన్నప్ప‌టికీ... గత 47 రోజులుగా చేస్తున్న సమ్మెకు ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు వారే స్వ‌యంగా ప‌లికిన నేప‌థ్యంలో..ఆయ‌న ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. కార్మికులను ఎట్లా డ్యూటీలో చేర్చుకోవాలె, ఏమేం కండిషన్లు పెట్టాలన్న దానిపై ఆలోచన చేస్తోందని.. లేబర్​ కోర్టు విచారణ, తీర్పు ఎట్లా ఉంటుందన్నది అంచనా వేస్తోందని సమాచారం. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్న దానిపై తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. డ్యూటీలో చేరిన కార్మికులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వాలని కూడా భావిస్తోందని, ప్యాకేజీ ప్రకటించి మెజారిటీ కార్మికులను బయటకి పంపించాలన్న ఆలోచన చేస్తోందని సమాచారం. బేషరతుగా చేర్చుకుంటరా? సమ్మె విరమిస్తే కార్మికులను బేషరతుగా డ్యూటీలోకి తీసుకునే అవకాశముందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.

 

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప‌లు క‌ఠిన ష‌ర‌తుల‌తో...కేసీఆర్ కార్మికుల స‌మ్మె ముగింపున‌కు ఓకే చెప్తారంటున్నారు.భవిష్యత్తులో కార్మికులు సమ్మె బాట పట్టకుండా, ఓ నిర్దిష్ట కాలం పాటు సమ్మె చేయబోమంటూ స్వయంగా ఒప్పుకునేలా షరతు విధించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా, సంస్థను సర్కారులో విలీనం చేయాలని అడగకూడదని, కార్మికులు ఆ డిమాండ్ ను శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుందన్నది కీలక షరతు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కార్మికుల నుంచి మళ్లీ ఈ డిమాండ్​ రాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తపడాలని సర్కారు భావిస్తోందని స‌మాచారం. ‘‘ప్రతి కార్మికుడు సంతకం చేసే పేపర్ లో.. విలీనం చేయాలని ఎప్పుడూ అడగబోమనేది మొదటి షరతుగా ఉంటుంది”అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: