ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2020-2021వ సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు 2020 నుంచి 2021 విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు. ఆ కాలం తర్వాత ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రారంభించాలని జారీలో పేర్కొన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలో కూడా ఒకటి నుంచి ఆరు వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. 

 


ఇక మీద అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు 1 నుంచి 6 వరకు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం లోనే ఉండకపోతే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుత ఉపాధ్యాయులకు ఇంగ్లీషు మాధ్యమంలో బోదించేలా శిక్షణ ఇవ్వాలని, కొత్త సిలబస్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. ఆంగ్లంలో బోధించగల ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే బాధ్యతలను కమీషనర్ తీసుకోవాలని ఆదేశించింది. 

 

ఎట్టకేలకు ఎన్నో విమర్శలను ఎదుర్కొని రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలనుకున్న నిర్ణయం వచ్చే విద్యసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ప్రతిపక్ష పార్టీ లు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే మాతృ భాష తెలుగు సబ్జెక్టును తీసేస్తామని అబద్దాలు చెప్తూ పక్కదోవ పట్టిస్తున్నారని అధికారపక్షం చెప్పారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ స్కూల్లో ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు ఎంతో లబ్ధి పొందుతారని అధికారపక్షం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. అందుకే ఎన్ని ప్రతిపక్షాలు ఎంత తప్పుడు ప్రచారం చేసిన మొత్తానికి రాష్ట్రంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించబోతుంది ఆంధ్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: