ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టినట్లు తెలంగాణలో కూడా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని... నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ ను కాపాడడం తో పాటు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను  తలపెట్టిన విషయం తెలిసిందే  . ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి  ఆర్టీసీ కార్మికుల గోసలు.   ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు  ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల విషయంలో ఒక్కసారి కూడా సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ అటు  ఆర్టీసీ కార్మికులు మాత్రం ఒక్కసారైనా ఆర్టీసీ సమ్మె గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించకపోతారా  తమ డిమాండ్లు పరిష్కారం బతుకులు బాగుపడకపోతాయా  అనే ఆశతో సమ్మెను కొనసాగించారు. 

 

 

 

 కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం ప్రతి క్షణం నిరాశే ఎదురైంది. ఆర్టీసీ సమ్మె మొదలైన మొదటి రోజు నుంచి ఆర్టీసీ సమ్మె విరమించిన ఈరోజు వరకు ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా నిరాశ ఎదురయింది . అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికుల విషయంలో మొండి  వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది ప్రభుత్వం . ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు అందరూ సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే అంటూ  సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమైన అంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు. అటు  ఆర్టీసీ కార్మికులు మాత్రం  ఎక్కడ నిరాశ పడకుండా పట్టుకోకుండా సమ్మెను కొనసాగిస్తూనే వచ్చారు.

 

 

 

 కానీ ఎంత పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులకు మాత్రం నిరాశే ఎదురైంది. దీంతో  ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏమిటో ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆర్టీసీ కార్మికులు నిరాశ తోనే సమ్మె విరమించిన పరిస్థితి వచ్చేసింది. తన 26 డిమాండ్లలో ఒక్కటి కూడా తమ పోరాటం ద్వారా సాధించలేకపోయాననీ బాధతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుంది అనుకున్నప్పటికీ హైకోర్టులో కూడా తమకు న్యాయం జరగకపోవడంతో నిరాశ చెందిన ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమణకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆర్టీసీ సమ్మె విరమించిన కార్మిక విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: