ఆర్టీసీ కార్మికుల సమ్మె ద్వారా అన్ని వైపుల నుంచి విపరీతమైన ఒత్తిళ్లను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తాను అంటే ఏంటో నిరూపించుకున్నారు. కొన్ని వేల మంది ఉద్యోగులు అతనికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నా... ప్రతిపక్షం అంతా కలిసి కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నా కొంచెం కూడా తొణకకుండా తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి వారందరి పైచేయి సాధించి చివరికి హైకోర్టునే ముప్పుతిప్పలు పెట్టాడు కెసిఆర్. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ వారు తాము సమ్మెను విరమించడానికి సిద్ధమని... అయితే ప్రభుత్వం విధులలోనుంది తొలగించిన వారందరినీ వెంటనే చేర్చుకోవాలని కోరారు.

 

అయితే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఎంతైనా కేసీఆర్ జరిగింది అంత తేలికగా మర్చిపోయే వ్యక్తి అయితే కాదు. ఆర్టీసీలో 50 శాతాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిన కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి మొత్తం తన ప్లాన్లు అన్నీ విరమించుకుని ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఉన్నారు. మరొకవైపు ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందిస్తూ... కార్మికులు విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే అని తేల్చి చెప్పిన విషయం కూడా తెలిసిందే. హైకోర్టు కూడా చేతులెత్తేసి లేబర్ కోర్టు కు కేసును బదిలీ చేసిన నేపథ్యంలో ఉన్న కాస్త ఆశలు కూడా ఆవిరైపోయి ఆర్టీసి జెఎసి నాయకులు కిందికి దిగి వచ్చిన నేపథ్యంలో కేసిఆర్ ఆత్మవిశ్వాసం మరింత బలపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే వారు చెబుతున్నట్లు తాముమ విధుల్లో చేరతాము కానీ ఎలాంటి పత్రాలు మరియు షరతులపై సంతకాలు పెట్టమని స్పష్టం చేశారు. విషయాన్ని ఇంత వరకు తీసుకొని వచ్చి ఇన్ని రోజులు కేసీఆర్ కు టెన్షన్ పుట్టించిన వీరిని కెసిఆర్ అంత తేలికగా విధుల్లోకి తీసుకుంటాడా అన్నది ప్రశ్న. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఇటువంటి అవకాశాన్ని వదులుకోన కచ్చితంగా విధుల్లోకి చేరాలంటే నిబంధనలు పాటించాలని మంకుపట్టు పట్టుకొని కూర్చుంటానని అభిప్రాయపడుతున్నారు. చివరకు ఈ అంకం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: