ఈ మధ్యకాలంలో అధికారులు లంచం తీసుకునే గాడిదలు ఎక్కువ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలవన్నట్టు పేద ప్రజలనుండి లంచాలు కావాలని పీక్కుతింటున్నారు. అయితే ఆలా చేసినందుకు చేయనందుకు తెలంగాణాలో అయితే ఓ తహశీల్ధార్ సజీవదహనం అయ్యింది. దీంతో మిగితా తహసీల్ధార్లు అంత అప్రమత్తమయ్యి ప్రజలకు న్యాయంగా కొందరు పనులు చేస్తున్నారు. కొందరు మాత్రం ప్రజల నుండి లంచాలు ఆశిస్తున్నారు. 

 

అయితే ఈసారి తహశీల్ధార్ కాదు.. విలేజ్ సెక్రటరీ చేసిన నిర్వాకం ఇది. జామీను పత్రాలపై సంతకాలు చేయాలంటే రెండు వేలు లంచం ఇస్తేనే సంతకం చేస్తాను అంటూ ఓ విలేజ్ సెక్రటరీ చెప్పిన నేపథ్యంలో గ్రామస్థులు తిరగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలోని గోపవరం మండలంలోని ఎస్ రామాపురం కి చెందిన చంటయ్య, శేషయ్య అనే రైతులు జామీను దారు సంబంధించిన సర్టిఫికెట్ కోసం గత వారం రోజులుగా విలేజ్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య దగ్గరికి తిరుగుతున్నారు.

 

అయితే ఆ విల్లగె సెక్రటరీ సంతకం చేయాలంటే రెండు వేల రూపాయలు లంచం ఇవ్వాలని లేకుంటే సంతకం చేయనంటూ రోజూ తిప్పుకోవడంతో విసిగిపోయిన చంటయ్య, శేషయ్యలు తమ గ్రామస్థులను కొంతమందిని వెంట తీసుకుని గోపవరం ఎంపిడిఓ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే గ్రామస్తులు విలేజ్ సెక్రటరీ వెంకట సుబ్బయ్యను నిలదీయడంతో అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. 

 

దీంతో అక్కడే ఉన్నవారు వివరాలు తెలుసుకొని వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీసిన వారు వాటిని సోషల్ మీడియాలో పెట్టగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. మరి ఈ ఘటనకు ఆ విలేజ్ సెక్రటరీ అరెస్ట్ అవుతాడా లేక సస్పెండ్ అవుతాడా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: