ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల లో భాగంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలను సగానికి సగం మూసేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం అమ్మేటట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన బార్లు మరియు రెస్టారెంట్ లను కూడా క్రమేపీ మూసి వేయనున్నట్లు కూడా ఆయన తెలిపాడు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తానని ప్రకటించిన ఆయన ప్రస్తుతానికి 20% బెల్టుషాపులను పూర్తిస్థాయిలో ఏరి పారేశాడు. చివరికి ఒక సామన్యుడు మద్యానికి బానిస అయి తన జీవితం నాశనం చేసుకొకుండా ఆయన అడ్డుపడ్డాడు.

 

ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కూడా మద్యం ధరలను భారీగా పెంచేందుకు సన్నాహాలు జరుపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే వారి రాష్ట్ర ఆదాయాన్ని కూడా దీని ద్వారా పెంచుకోవాలని చూస్తోందట. ఈ విషయమై కేబినెట్ సబ్ కమిటీ కొద్దిరోజుల్లోనే ఏర్పాటుచేసి పెంచాల్సిన ధరల విషయమై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ వదిలిన తర్వాత వెంటనే దీనిని అమల్లోకి తెస్తారని చెబుతున్నారు.

 

ఒకవేళ మద్యం ధరలు పెంచేసినట్లయితే సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1700 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. దీనిని బట్టి మద్యం రేట్లను దాదాపు 10 శాతం పెంచనున్నట్లు మనం గమనించవచ్చు. అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా ప్రభుత్వం కూడా ఎక్సైజ్ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త పర్మిషన్ లకు వచ్చే లైసెన్స్ ఫీజు రూపంలో పొందేందుకు ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో లో మందు రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి తమ మకాం ఏర్పాటు చేసుకున్న కొంతమంది మందుబాబులు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: