తాజాగా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు అవ్వడం జరిగింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు కూడా రావడం జరిగింది.

 

చెన్నమనేని రమేష్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్‌ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ 2009 నుంచి న్యాయపోరాటం మొదలు పెట్టారు.

 

చెన్నమనేని పౌరసత్వాన్ని 3 నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఈ అంశంపై అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచనలు చేసింది. దీనిపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్‌ గెలుపొందిన సంగతి అందరికి  తెలిసిందే కదా.

 

వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్ధారించడం జరిగింది. చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తెలియచేయడం జరిగింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయన జర్మనీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ద్వంద్వ పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై చెన్నమనేని రమేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: