రాజస్థాన్‌లో గత ఆగస్టులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ మరుసటి నెలలో దక్షిణాఫ్రికాలో ఓ వ్యాపారవేత్తను కొందరు కాల్చి చంపారు. జూన్‌లో మెక్సికోలో ఓ పర్యావరణ ఉద్యమకారుడు హత్యకు గురయ్యారు.ఈ ఘటనలు జరిగిన ప్రాంతాల మధ్య వేల మైళ్ల దూరం ఉన్నా, ఈ మరణాలన్నింటీ వెనుక ఓ కారణం బలంగా కనబడుతోంది. అదే ఇసుక.ఇసుక ప్రాధాన్యాన్ని అందరూ పెద్దగా గుర్తించలేకపోవచ్చు. 21వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన వస్తువు ఇది.ఇసుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణలే ఆ మూడు ఘటనలు.అధునాత నగరాల నిర్మాణానికి అవసరమైన అత్యంత మౌలిక వస్తువు ఇసుక.

 

భూమి మీద ఇసుక విస్తారంగా దొరుకుతుంది. సహారా నుంచి ఆరిజోనా వరకూ పెద్ద పెద్ద ఎడారుల్లో కుప్పలుతెప్పలుగా ఉంది. తీరాల పొడవునా అభిస్తోంది. ఏ దేశంలోనూ దానికి లోటు లేదు. అసలు అది తరిగిపోయే అవకాశం ఉందా అన్న సందేహమూ మనకు వస్తుంది.నిర్మాణాల కోసం వినియోగించే ఇసుక వాగుల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఉండే సరస్సుల్లో దొరుకుతుంది. దీనిలోని ఇసుక రేణువులు కోణీయంగా ఉంటాయి. ఈ ఇసుకకు డిమాండ్ తీవ్రంగా పెరగింది. ప్రపంచవ్యాప్తంగా వాగులు, నది తీరాలు, సరస్సుల నుంచి ఇసుక మొత్తం ఖాళీ అవుతోంది.

 

చాలా దేశాల్లో నేర ముఠాలు ఇసుకను వ్యాపారంగా మలుచున్నాయి.భారీ ఎడారి అంచున ఉండే దుబాయ్‌ కూడా ఆస్ట్రేలియా నుంచి ఇసుక దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ నగరంలో డిమాండ్ ఆ స్థాయిలో ఉంది.గాజుతో పాటు సోలార్ ప్యానెల్లు, కంప్యూటర్ చిప్స్ వంటి హైటెక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగించే స్వచ్ఛమైన సిలికా ఇసుకకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

 

ఇసుకకు డిమాండ్ భారీగా పెరగడంతో చాలా ప్రాంతాల్లో నేర ముఠాలు దీని వ్యాపారంలోకి దిగాయి. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి.లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని ఇసుక రీచ్‌లలో చిన్నారులను బానిసలుగా చేసుకుని వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: