గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాలని కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉందంటే. అది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీదే. ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైన విషయం దగ్గర నుంచి తాజాగా వైసీపీలోకి వెళ్ళేందుకు లైన్ క్లియర్ అయ్యేవరకు జరిగిన పరిణామాలు ఉత్కంఠ రేపుతూనే వచ్చాయి. అంటే వంశీ టీడీపీని వీడేశారు. త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. కాకపోతే ఎప్పుడు చేరతారనే దానిపై క్లారీటీ లేదు. ఇక్కడ వంశీ మేటర్ పక్కనబెట్టేస్తే..మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గురించి చెప్పాలి.

 

ఆయన మొదటి నుంచి వంశీ రాకని వ్యతిరేకిస్తున్నారు. ఆయన అభిమానులు కూడా అదే చెబుతున్నారు. అయితే ఆయన భవిష్యత్తుపై సీఎం స్వయంగా హామీ ఇవ్వడంతో వెనక్కితగ్గారు. వంశీని వైసీపీలోకి తీసుకుంటే వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తాజాగా యార్లగడ్డ మీడియా సమావేశం పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను జగన్ కు విధేయుడునని, ఆయన మాట కాదనని, కాకపోతే వంశీ గురించి తనకు తెలియదని మాట్లాడారు.

 

అలాగే వంశీ...జగన్ పథకాల పట్ల ఆకర్షితులై వస్తున్నారో? లేక కేసులకు భయపడి వస్తున్నారో? తెలియదని మాట్లాడారు. ఇక ఎన్నికలకు ముందు వంశీ ఇచ్చిన ఇళ్ల పట్టాలు నకిలీవేనని అన్నారు. అలాగే వాటి స్థానంలో తమ ప్రభుత్వం కొత్త ఇళ్ల పట్టాలు ఇవ్వనుందని చెప్పారు. ఇక్కడ యార్లగడ్డ వ్యాఖ్యలని బట్టి చూస్తే వంశీ తప్పు చేశారనే అర్ధమవుతుంది. కేసులు పెట్టడం వల్లే ఆయన వైసీపీలోకి వస్తున్నాడని తెలుస్తోంది. అంటే ఒకవైపు ఇలా తప్పు చేశారని వైసీపీ నేత చెబుతున్న జగన్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని కొందరు వైసీపీ కార్యకర్తల మదిలో అనుమానాలు వస్తున్నాయి.

 

పైగా ఆయన టీడీపీలో ఉన్నప్పుడూ జగన్ని దారుణంగా విమర్శించారు కూడా. ఇవేమీ వైసీపీ కార్యకర్తలకు నచ్చడం లేదు. అయినా సరే వంశీతో ఉన్న సాన్నిహిత్యంతోనే జగన్ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వంశీ మీద ఉన్న కేసు పూర్తయ్యాక జగన్ చేర్చుకుంటే బాగుండేదేమో అని వైసీపీ కేడర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: